Hot Posts

6/recent/ticker-posts

TGSET Notification Released..

 TGSET Notification Released..

TGSET నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివిగో !



📝తెలంగాణలోని డిగ్రీ కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా లేదా లెక్చరర్‌గా స్థిరపడాలని కలలు కనే అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ, ఫీజు, ఎడిట్ ఆప్షన్, పరీక్షల నిర్వహణ తేదీలను మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ బి. శ్రీనివాస్ గారు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.


🗓️షెడ్యూల్ ముఖ్యమైన తేదీలు:


ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం:

ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ ఆగస్టు 3 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఎలాంటి లేట్ ఫీజు ఆగస్ట్ 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందే అప్లై చేసుకోవడం మంచిది.


🪧లేట్ ఫీజు వివరాలు:

ఒకవేళ సాధారణ గడువు లోపు అప్లై చేయలేకపోయినా కంగారు పడాల్సిన పనిలేదు. వేర్వేరు లేట్ ఫీజులతో అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు.


📍ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 5 వరకు రూ.1500 లేట్ ఫీజుతో అప్లై చేసుకోవచ్చు.

2.సెప్టెంబర్ 6 నుంచి 10వ తేదీ వరకు రూ.2000 లేట్ ఫీజుతో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.


3.సెప్టెంబర్ 11 నుంచి సెప్టెంబర్ 12 వరకు అప్లై చేసుకోవచ్చు. 👇👇


TG SET APPLY HERE


✍🏻ఎడిట్ ఆప్షన్, హాల్ టికెట్లు:

అప్లికేషన్ నింపే సమయంలో ఏవైనా పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకోవడానికి సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. అప్లై చేసుకున్న అభ్యర్థులు సెప్టెంబర్ 22 నుంచి తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.