ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
Inservice Teachers Special TET notification..
■ నవంబర్ 16 నుంచి పరీక్షలు.
- తెలంగాణలో ఇన్ సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (స్పెషల్ టీజ్ టెట్)-2 నిర్వహించనుట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.
- గురువారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, టెట్ ఛైర్మన్ నవీన్ నికోలస్ నోటిఫికేషన్ జారీ చేశారు.
- రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు, టీజీఆర్ఈఐఎస్, ప్రభుత్వ సంక్షేమ గురుకుల సొసైటీలు, తెలంగాణ మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ టీచర్లతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మాత్రమే ఈ ప్రత్యేక టెట్కు అర్హులని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.
- ఈ టెట్ను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో నిర్వహించ నున్నారు.
- నవంబర్ 16 నుంచి 21 వరకు పరీక్షలు జరగనున్నాయి.
- పరీక్షకు సంబంధించిన ఇన్నర్మేషన్ బులెటిన్పూర్తి నోటిఫికేషన్ను అక్టోబర్ 7 నుంచి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.
- TG TET NOTIFICATION PDF
- అభ్యర్థులు అక్టోబర్ 7 నుంచి 16 వరకు ఆన్లైన్లో పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించుకోవచ్చని పాఠశాల విద్యా శాఖ తెలిపింది.
- దరఖాస్తు ప్రక్రియ, పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్సైట్లో పరిశీలించాలని సూచించింది.
ముఖ్య తేదీలు..
- నోటిఫికేషన్: అక్టోబర్ 1, 2026
- ఇన్ఫర్మేషన్ బుెలెటిన్: అక్టోబర్ 7 నుంచి
- ఆన్లైన్ దరఖాస్తులు: అక్టోబర్ 7 నుంచి 16 వరకు
- టెట్ పరీక్షలు: నవంబర్ 16 నుంచి 21 వరకు
- పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)

Social Plugin