MLC Graduate Voters Enrollment
పట్టభద్రుల ఓటర్ల నమోదు
• ఫారం-18 నింపాలి.. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో సమర్పించాలి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్న రాజకీయ పార్టీలు
మహబూబ్ నగర్రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ల నమోదు ప్రక్రియకు ఎన్నికల సంఘం అధి కారులు సోమవారం నోటిఫికేషన్ జారీచేశారు.
ఈ ఏడాది నవంబరు 1 నాటికి.. డిగ్రీ పూర్తిచేసి మూడేళ్లు పూర్తయిన పట్టభద్రులు ఓట ర్లుగా నమోదుకు అవకాశం ఉంది. ఇందుకుగాను ఫారం-18 నింపాల్సి ఉంటుంది. నవంబరు 6 వరకు ఓటర్ల నమోదుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు.
డీఈవోలు, ఈఆర్వోలు, ఏఈఆర్వోల కార్యా లయాల వద్ద ఫారం-18 పత్రాలను అందుబా టులో ఉంచనున్నారు. పోస్టుద్వారా కూడా ఈఆ ర్వోలు, ఏఈఆర్వోలకు దరఖాస్తులను పంపించ వచ్చు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల సంఘం వెబ్సైట్
పట్టభద్రుల ఓటర్ల నమోదు
ఈ నేపథ్యంలో ఈ నెల 17న ఓటర్ల జాబితా షెడ్యూ ల్ను ఎన్నికల అధికారులు విడుదల చేశారు.
రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటర్ల నమో దుకు రాజకీయ పార్టీలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తు న్నాయి. ఈ ఎమ్మెల్సీ స్థానాలను ప్రధాన పార్టీలు సవాలుగా తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఓటర్ల నమో దుకు చేపట్టాల్సిన వ్యూహాలపై దృష్టి సారించాయి.
ఆన్లైన్ ద్వారా నమోదు చేసేవిధంగా ఏర్పాట్లు చేసు కుంటున్నాయి. మండలాన్ని ఒక యూనిట్గా తీసు కుని గ్రామాలవారీగా డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు పూర్త యినవారిని గుర్తిస్తున్నారు.
మండల కేంద్రాల్లో మండల కేంద్రాల్లో ప్రత్యేక ల్యాప్టాప్లతో శిబిరాలను ఏర్పాటుచేసి ఆన్ లైన్ లో వారి పేర్లను నమోదుచేసేలా సన్నాహాలు చేస్తున్నారు.
👉 మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు కూడా టీచ
ర్లను గుర్తించి ఆన్లైన్లో నమోదుచేయించే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
👉 చాలామంది పట్టభ ద్రులు ఆన్లైన్ ద్వారా ఓటరు నమోదు వైపు మొగ్గు చూపనున్నారు.
👉 ఆన్లైన్లో ఫారం-18 నింపిన తర్వాత ప్రింట్ తీసి స్థానిక ఎన్నికల అధికారులకు ఆ పత్రాలను అందించాల్సి ఉంటుంది. మరోవైపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారికి ఈ ఆర్వో, డీఈవో కార్యా లయాల్లో పత్రాలను అందుబాటులో ఉంచుతామని ఎన్నికల నమోదు అధికారులు పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో రెండు పట్టభద్రుల నియోజ కవర్గాల్లో ఎన్నికల అధికారులు ఓటర్ల నమోదుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది.
ఆన్లైన్ లో apply కొరకు కింది లింక్ నొక్కండి..
👇👇👇👇

Social Plugin