Find out the oxygen level in our phone
మన ఫోన్‌లోనే ఆక్సిజన్ స్థాయి తెలుసుకోండిలా!
తయారు చేసిన కోల్‌కతాకు చెందిన అంకుర సంస్థ
👉కరోనా second wave ఇండియాను గడగడలాడిస్తోంది.
👉1st wave తో పోలిస్తే దీని తీవ్రత అధికంగా ఉంది.
👉👉 ఈ దశ లో ముఖ్యంగా ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్నవారే అధికంగా ఉన్నారు.
👉అందుకే మన శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలు తెలిపే పల్స్ ఆక్సీమీటర్లు, స్మార్ట్ వాచ్‌లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోవడం జరుగుతుంది.
👉So అమాంతంగా వాటి ధరలు పెరిగిపోయాయి.
👉ఈ ఇబ్బందులేవీ లేకుండా సింపుల్‌గా మన ఫోన్‌లోని ఒక యాప్‌తో శరీరంలోని ఆక్సిజన్ స్థాయి, పల్స్, శ్వాసక్రియల రేట్లు తెలిసేలా ఉంటే బావుంటుంది కదా అనే ఆలోచన నుంచి వచ్చిందే ‘కేర్‌ప్లిక్స్ వైటల్స్ యాప్’.
👉 కలకత్తా కు చెందిన ‘carenow health care అనే Startup company దీన్నీ తయారు చేసింది.
ఇది ఎలా పనిచేస్తుందంటే....
👉ఫోటో ప్లెథిస్మోగ్రఫీ టెక్నాలజీతో, కృత్రిమ మేధ సాయంతో కేర్‌ప్లిక్స్ వైటల్స్ యాప్ పనిచేస్తుంది.
👉సాధారణంగా ఆక్సీమీటర్లలో ఇన్‌ఫ్రారెడ్ లైట్ సెన్సార్లు ఉంటాయి.
👉కానీ ఈ App లో కేవలం మన ఫోన్‌లోని flash ఆధారంగా O 2 స్థాయి తెలుసుకోవచ్చు.
👉ఈ యాప్‌ను తెరచి మన ఫోన్ ఫ్లాష్‌లైట్ ఆన్ చేసి వెనుక కెమెరాపై మన వేలిని ఉంచాలి.
👉తర్వాత Scan అనే button నొక్కగానే 40 సెకన్లలో ఆక్సిజన్, పల్స్, శ్వాసక్రియ రేట్లను యాప్‌లో చూపిస్తుందని కేర్‌నౌ హెల్త్‌కేర్ సహవ్యవస్థాపకుడు శుభబ్రాతా పాల్ వెల్లడించారు.
👉ఈ ఏడాది ప్రారంభంలో దీనిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని ఆయన తెలిపారు.
👉అందులో ఈ యాప్ 96 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు నిరూపితమైందని వెల్లడించారు.
డౌన్‌లోడ్ ఇలా...చేసుకోవచ్చు.
👉ఈ యాప్ ప్రస్తుతం ios వినియోగదారుల కోసం యాప్‌స్టోర్‌లో అందుబాటులో ఉంది.
👉ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అయితే వెబ్‌సైట్‌లో Apk ను అందుబాటులోకి ఇచ్చారు.
👉త్వరలోనే play store లో కి తీసుకొస్తారని సమాచారం.
👉అలాగే సింగిల్ యూజర్ వినియోగం కోసం ఉచితంగా అందిస్తున్నారు.
👉అంతకుమించి సేవలు కావాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
👉వివరాలు care now website లో ఉన్నాయి.
==================================
Check your lungs Position :-
👇👇👇👇
CLICK HERE
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Social Plugin