Hot Posts

6/recent/ticker-posts

SGSP ACCOUNT వల్ల కలిగే లాభాలు.

 


వేతన ఖాతాతో లాభాలెన్నో -వివిధ బ్యాంకులు అందించే ప్రయోజనాలు


🔷వేతన ఖాతాతో లాభాలెన్నో🔷


🔷వ్యక్తిగత ప్రమాద బీమా రక్షణ🔷


🔷రుణాల మంజూరులో ప్రాధాన్యం🔷


🔷రాయితీపై లాకర్లు, ఎక్స్‌క్లూజివ్‌ క్రెడిట్‌కార్డులు🔷

                     

👉వివిధ బ్యాంకులు ఆఫర్‌ చేస్తున్న టాప్‌ శాలరీ అకౌంట్లు ఇవీ*


♦️వేతన ఖాతా (శాలరీ అకౌంట్‌)తో మీకు లభించే ప్రయోజనాలేమిటో తెలుసా? మీ యజమాని లేదా కంపెనీ మీ నెలవారీ వేతనాన్ని జమచేసే బ్యాంక్‌ అకౌంట్‌నే వేతన ఖాతా అంటారు. బ్యాంకులతో పొత్తు పెట్టుకొని కంపెనీలు ఈ ఖాతాలను తెరుస్తాయి. కానీ వ్యక్తిగతంగా ఉద్యోగులే ఈ ఖాతాలను తెరిచేందుకు కొన్నిబ్యాంకులు అనుమతిస్తున్నాయి. ఎన్నో ప్రయోజనాలున్న ఈ ఖాతాలో మీరు కనీస మొత్తాన్ని నిల్వ ఉంచాల్సిన అవసరం ఉండదు. కొన్ని బ్యాంకులు వ్యక్తిగత ప్రమాద బీమాతోపాటు తక్షణ వ్యక్తిగత రుణాలు, ఎక్స్‌క్లూజివ్‌ క్రెడిట్‌ కార్డుల్లాంటి అదనపు సదుపాయాలను కూడా కల్పిస్తున్నాయి. ఆ వివరాలేమిటో ఓసారి పరిశీలిద్దాం.*


💥SBI  కార్పొరేట్‌ శాలరీ ప్యాకేజీ💥


👉ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతిపెద్దదైన ఎస్బీఐ తమ బ్యాంకులో వేతన ఖాతా తెరిచినవారికి అనేక ప్రయోజనాలను కల్పిస్తున్నది. దవాఖానలు, హోటళ్లు, రవాణా సంస్థలు, కార్పొరేట్‌ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు వేతనాల ఆధారంగా సిల్వర్‌, గోల్డ్‌, డైమండ్‌, ప్లాటినమ్‌ క్యాటగిరీల్లో ఈ ప్రయోజనాలను అందజేస్తున్నది. ఈ బ్యాంకులో వేతన ఖాతా తెరిచినవారు దేశవ్యాప్తంగా అన్ని ఏటీఎంలలో ఉచితంగా అపరిమిత లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలుంటుంది. అంతేకాకుండా ఎస్బీఐ క్రెడిట్‌కార్డు, వ్యక్తిగత, వాహన, గృహ, విద్యా రుణాలతోపాటు రూ.20 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమాను, 25 శాతం తక్కువ ధరతో లాకర్‌ను పొందవచ్చు.*


💥కొటక్‌ ప్లాటినా శాలరీ అకౌంట్‌💥


👉కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఆఫర్‌ చేస్తున్న ఈ ఖాతాలో మీరు నిల్వ ఉంచే సొమ్ముకు గరిష్ఠంగా 4% వడ్డీ లభిస్తుంది. కొటక్‌ ప్లాటినమ్‌ డెబిట్‌కార్డును ఉపయోగించి అన్ని వీసా ఏటీఎంలలో అపరిమితంగా ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చు. ఈ ఖాతా నుంచి ఆన్‌లైన్‌లో నెఫ్ట్‌, ఆర్టీజీఎస్‌ లేదా ఐఎంపీఎస్‌ ద్వారా మరో బ్యాంకుకు ఉచితంగా సొమ్మును బదిలీ చేసుకోవచ్చు. కొటక్‌ బ్యాంకు శాఖల నుంచి అపరిమిత విలువ కలిగిన డీడీలను తీయవచ్చు. ప్లాటినా వేతన ఖాతాదారులకు రూ.35 లక్షల వరకు ప్రమాద బీమా రక్షణతోపాటు 25% తక్కువ ధరతో లాకర్‌ లభిస్తుంది.*


💥హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్లాసిక్‌ శాలరీ అకౌంట్‌💥


👉ఈ ఖాతాను తెరువాలంటే మీరు ఏదైనా కార్పొరేట్‌ కంపెనీలోనైనా లేక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో వేతన ఖాతా సంబంధాలను కలిగివున్న మరే ఇతర సంస్థలోనైనా పనిచేసే ఉద్యోగులై ఉండాలి. ఈ ఖాతాదారులు దేశీయ ఏటీఎం నుంచి రోజుకు రూ.లక్ష వరకు నగదు ఉపసంహరించుకోవచ్చు. అంతేకాకుండా ఎలాంటి చార్జీలు లేకుండా దేశీయంగా రోజుకు రూ.3.5 లక్షల పరిమితితో షాపింగ్‌ చేసుకోవచ్చు. రూ.10 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా రక్షణ లభిస్తుంది.*


💥యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రైమ్‌ శాలరీ అకౌంట్‌💥


👉అధిక పరిమితి కలిగిన లావాదేవీల నిర్వహణకు ఈ ఖాతా ఎంతో అనువైనది. ఆరంభంలో ఎలాంటి డిపాజిట్‌ చేయకుండానే ఈ ఖాతాను తెరిచేందుకు వీలున్నప్పటికీ ఆ తర్వాత నెలవారీ బ్యాలెన్స్‌ను మెయింటెయిన్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ఖాతాలో నిల్వ ఉంచిన సొమ్ముకు 3.50 శాతం వరకు వార్షిక వడ్డీ లభిస్తుంది. ప్రైమ్‌ శాలరీ అకౌంట్‌ను తెరిచినవారు యాక్సిస్‌ బ్యాంకు నుంచి ఉచితంగా వీసా రివార్డ్స్‌ ప్లస్‌ డెబిట్‌కార్డుతోపాటు ఆ బ్యాంకుకు భాగస్వాములుగా ఉన్న రెస్టారెంట్లలో డిస్కౌంట్లు, సినిమా టికెట్లపై క్యాష్‌బ్యాక్‌, వ్యక్తిగత ప్రమాద బీమా లాంటి సదుపాయాలను పొందవచ్చు.*


💥సిటీ బ్యాంక్‌ సువిధ శాలరీ అకౌంట్‌💥


👉ఈ ఖాతా తెరిచినవారు సిటీ బ్యాంక్‌ క్రెడిట్‌కార్డుతోపాటు వ్యక్తిగత, గృహ, వాహన రుణాలను సులభంగా పొందవచ్చు. రోజుకు రూ.లక్ష పరిమితితో డెబిట్‌కార్డు, రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా లభిస్తుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులకు సైతం సమగ్ర బీమా సదుపాయాన్ని పొందవచ్చు. ఈ కార్డుతో జరిపే వివిధ రకాల లావాదేవీలపై రివార్డు పాయింట్లు వస్తాయి. వీటిని రిడీమ్‌ చేసుకుంటే క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌏🌎🙏🙏🙏🙏