Hot Posts

6/recent/ticker-posts

చలికాలం లో ఈ పండును అస్సలు మిస్సవద్దు.



👉చలి కాలంలో దొరికే సీతాఫలాలను అస్సలు మిస్‌ అవ్వొద్దు.

👉 సీజనల్‌ ఫ్రూట్స్‌లోనే ఇది ప్రత్యేకం. ఈ కాలంలో మార్కెట్లో విరివిగా దొరుకుతాయి. 

👉ఈ పండువల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందుకే దీన్ని ఆరోగ్యఫలం అంటారు. 

👉శీతాకాలం పండుగా పరిగణించే సీతాఫలం పోషకాల సమాహారం.

 👉కొన్ని రకాల అనారోగ్యాల నివారణి. మరెన్నో సుగుణాలున్న ఈ పండు గురించి వివరింగా తెలుసుకుందాం.


👉ఈ కాలంలో మూడు నెలలకు పైగా లభిస్తుంది సీతాఫలం. ఈ పండు రామాఫలం,, లక్ష్మణఫలం రకాల్లోనూ దొరుకుతుంది. 

👉చూడడానికి ఒకే విధంగా ఉన్నా... రుచి, వాసనలో కాస్త తేడా  కూడా ఉంటుంది. 

👉సీజన్‌ వస్తోందంటే చాలు... కొన్ని పండ్ల రుచి పదే పదే గుర్తొచ్చేస్తుంటుంది.

👉మార్కెట్లో అవి ఎప్పుడెప్పుడు కనిపిస్తాయా అన్నట్లు ఎదురుచూసేలా చేస్తుంది. 

👉ఆ కోవకే చెందుతాయి సీతాఫలం, రామాఫలం, లక్ష్మణఫలాలు. ఈపేర్లు చూస్తే మన పురాణ పురుషులకు ఇష్టమైన పండ్లు అని  అనిపించకమానదు.

👉 అంతేకాదు, ఇవి అచ్చంగా మనకి మాత్రమే ప్రత్యేకమైన పండ్లు అని అనిపిస్తుంది..


💥కానీ వీటి స్వస్థలం మనదేశం కాదు.💥 

👉దక్షిణ అమెరికా,,  ఐరోపా,,  ఆఫ్రికన్‌ దేశాల్లో పెరిగే ఈ మొక్కల్ని మనదేశానికి తొలిసారిగా పోర్చుగీసువాళ్లు 16 శతాబ్దంలో తీసుకొచ్చారట. 

👉మనరాష్ట్రంలో ఎక్కువగా పండే సీతాఫలాలతోనే మనకి అనుబంధం ఎక్కువ. 

👉కానీ ఉత్తరాంధ్ర, కొన్ని తెలంగాణా జిల్లాల్లోనూ కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోనూ రామాఫలాలు, లక్ష్మణఫలాలు ఎక్కువగా పండుతాయి. 

👉అమృతఫలాన్ని తలపించే సీతాఫలాన్నే Custard Apple‌ అని,Sugar apple‌ అని పిలుస్తారు. ఇది దక్షిణ అమెరికా దేశాలతోపాటు మనదేశంలోనూ విరివిగా పండుతుంది. 

👉పండుగా తినడంతోపాటు స్వీట్లు, జెల్లీలు, ఐస్‌క్రీములు, జామ్‌లు చేస్తుంటారు. 

👉మనందరికీ పండుగానే సుపరిచితమైన ఇది ఛత్తీస్‌గఢ్‌ వాసులకు మాత్రం అద్భుత ఓషధీఫలం.


💥ఆరోగ్య ప్రయోజనాలు..💥


👉తిన్న వెంటనే శక్తినిచ్చే పండు సీతాఫలం. కండరాలకు బలాన్నిస్తుంది.

👉విటమిన్‌ సి పుష్కలంగా ఉండే ఈ పండు తినటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటివి దరిచేరవు.

👉కేన్సర్‌ కణాలతో పోరాడే లక్షణం వీటికుంది. 

లివర్‌ కేన్సర్‌, మెదడులో ట్యూమర్స్‌, బ్రెస్ట్‌ కేన్సర్‌ రాకుండా చేసే గుణం సీతాఫలానికుంది.

👉ఈ పండ్లలో బి6 విటమిన్‌ అధికంగా ఉంటుంది. 

ఒత్తిడి, డిప్రెషన్‌ రాకుండా చేయటంతో పాటు మెదడు చురుగ్గా ఉండేందుకు ఉపయోగపడుతుంది.

👉దంతాలకు మంచి ఆహారం. దంతాల్లోని నొప్పిని నివారిస్తుంది. 

👉వాంతులు రాకుండా చేసే గుణం సీతాఫలాలకుంది.

ఐరన్‌ అధికంగా ఉండే సీతాఫలాలు తినటం వల్ల అనీమియా వ్యాధి రాదు. 

👉కళ్ల ఆరోగ్యానికి అద్భుతంగా ఉపయోపడుతుంది.

సీతాఫలాలు తినటం వల్ల కీళ్లనొప్పులు వచ్చే శాతం తక్కువగా ఉంటుంది.

👉గుండెకు మంచిది, డయాబెటిస్‌ దరి చేరనివ్వదు.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

👉చర్మం, వెంట్రుకల ఆరోగ్యానికి సీతాఫలాలు చక్కగా ఉపయోగపడతాయి. 

👉చర్మ సమస్యల్ని నివాంచే లక్షణం కూడా వీటికి ఉంది.