జనగణన 2027: సెల్ఫ్-ఎన్యూమరేషన్ మొబైల్‌లో స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్.. ఇంట్లో కూర్చునే మీ ‘ఇంటి’ వివరాలు నమోదు చేయండి..!
దేశంలో మొట్టమొదటి డిజిటల్ జనగణన (Census 2027) ప్రక్రియలో భాగంగా, పౌరుల సౌకర్యార్థం ‘సెల్ఫ్-ఎన్యూమరేషన్’ (స్వీయ నమోదు) గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. గణాంక సిబ్బంది (Enumerator) మీ ఇంటికి రాకముందే, 15 రోజుల ముందే ఈ పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోనే మీ కుటుంబ వివరాలను ఆన్‌లైన్‌లో సులభంగా పూర్తి చేయవచ్చు.
నమోదు ప్రక్రియ : స్టెప్-బై-స్టెప్ గైడ్...
*◾సెల్ఫ్-ఎన్యూమరేషన్ లింక్ :https://se.census.gov.in
దశ 1: పోర్టల్ లాగిన్
👉ముందుగా https://se.census.gov.in పోర్టల్‌ను సందర్శించండి.
మీ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతాన్ని ఎంచుకుని, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి. (మ్యాప్‌లో ఇంటిని గుర్తించడానికి ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ వాడటం ఉత్తమం).
దశ 2: గృహ రిజిస్ట్రేషన్
కుటుంబ యజమాని పేరు: ఇంటి పెద్ద పేరును నమోదు చేయండి. (ఒకసారి నమోదు చేస్తే ఈ పేరును మార్చలేరు).
మొబైల్ నంబర్: ఒక కుటుంబానికి ఒక మొబైల్ నంబర్ మాత్రమే వాడాలి. ఈ నంబర్‌ను వేరే ఇంటికి వాడకూడదు.
దశ 3: భాష మరియు OTP
మీకు నచ్చిన భాషను ఎంచుకోండి (తర్వాత మార్చలేరు).
మీ మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని ఎంటర్ చేసి వెరిఫై చేయండి.
దశ 4 & 5: మ్యాప్‌లో ఇంటి గుర్తింపు.
👉మీ జిల్లా, పిన్ కోడ్, గ్రామం/పట్టణం మరియు సమీప ల్యాండ్‌మార్క్ వివరాలను ఇవ్వండి.అనంతరం మ్యాప్‌పై కనిపించే రెడ్ మార్కర్‌ను ఖచ్చితంగా మీ ఇల్లు ఉన్న చోటుకి డ్రాగ్ చేసి 'Save & Next' క్లిక్ చేయండి. ఇది మీ డేటాను సరైన బ్లాక్‌కు కేటాయించడానికి సహాయపడుతుంది.
దశ 6 & 7: ప్రశ్నావళి పూర్తి చేయడం.
ఇళ్ల జాబితాకు సంబంధించిన ప్రశ్నలన్నింటినీ పూర్తి చేయండి. సందేహాలు ఉంటే 'Tooltips' లేదా 'FAQs' సహాయం తీసుకోండి.వివరాలన్నీ ఎంటర్ చేశాక 'Preview' బటన్ ద్వారా తప్పులు ఉన్నాయేమో సరిచూసుకోండి. కావాలంటే 'Save as Draft' కూడా చేసుకోవచ్చు.
దశ 8: ఫైనల్ సబ్మిట్ & SE ID
➡అంతా సరిగ్గా ఉందని నిర్ధారించుకున్నాక 'Final Submit' చేయండి. ఆ తర్వాత మీరు మార్పులు చేయలేరు.సబ్మిట్ చేసిన వెంటనే 'H' అక్షరంతో మొదలయ్యే 11 అంకెల విశిష్ట SE ID జనరేట్ అవుతుంది. ఇది మీకు SMS మరియు ఈమెయిల్ ద్వారా కూడా వస్తుంది. దీనిని స్క్రీన్‌షాట్ తీసి దాచుకోండి.
👉▪గణాంక సిబ్బంది (Enumerator) వచ్చినప్పుడు ఏం చేయాలి..?
👉 మీ ఇంటికి సెన్సస్ సిబ్బంది వచ్చినప్పుడు, మీరు ఇప్పటికే జనరేట్ చేసుకున్న SE, IDని వారికి చూపించాలి.
👉వారు తమ మొబైల్ యాప్‌లో ఆ IDని నమోదు చేసినప్పుడు, మీ డేటా మ్యాచ్ అయితే.. మీ గణన ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు పరిగణిస్తారు.
👉ఒకవేళ ID మ్యాచ్ కాకపోతే, వారు మళ్ళీ మీ వివరాలను మొదటి నుంచి సేకరిస్తారు.
Note:- సెల్ఫ్ ఎన్యూమరేషన్ (SE) చేయవలసిన రోజులు 26-04-2026 నుండి 10-05-2026.

Social Plugin