Hot Posts

6/recent/ticker-posts

27 to summer holidays..! The last working day for the harvest is 26

 🔊27 నుంచి వేసవి సెలవులు..!



 🔶బడులకు చివరి పనిదినం 26


 🔷కోవిడ్‌ తీవ్రమవుతున్నందున సర్కారు యోచన


🔶ప్రభుత్వానికి విన్నవించిన పలు ఉపాధ్యాయ సంఘాలు.


🔷1 నుంచి 9 వరకు అందరూ పాస్


 📜నేడో, రేపో ఉత్తర్వులు


🍥రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్‌ పాఠశాలలకు ఈనెల 27 నుంచి వేసవి సెలవులు ప్రకటించే అవకాశ మున్నది. 


👉బడులకు ఈనెల 26 చివరిపనిదినంగా ఉండ నుంది. రాష్ట్రంలో కరోనా పంజా విసురుతున్నది. ఈ నేప థ్యంలో బడులకు సెలవులు ప్రకటించే అవకాశముందనే అంటున్నాయి అధికారవర్గాలు.


 👉ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులందర్నీ ఉత్తీర్ణులుగా ప్రకటించనుంది. పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేనందున వారిని ప్రమోట్‌ చేయనుంది.


 👉ఇంకోవైపు పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. 


👉ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ)-1 మార్కులను ఈనెల 26 నాటికి అప్‌లోడ్‌ చేయా లని డీఈవోలను ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఆదేశించారు. 


👉అటు పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన మార్కులు పంపే పని సైతం ముగుస్తుంది. మరోవైపు పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.


👉ఈ సెలవుల్లో ఉపాధ్యాయులు పదోన్నతులు, బదిలీలు నిర్వహించాలని కోరాయి. పాఠశాలలకు సెలవులు ప్రకటించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది.


 👉ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ఈనెల 27 నుంచి బడులకు వేసవి సెలవులు ప్రకటించాలని కోరుతూ దస్త్రం రూపొందించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు పంపించింది.


 👉అది పరిశీలనలో ఉన్నది. శనివారం లేదా ఆదివారం ఉత్తర్వులు విడుదల చేసే అవకాశమున్నది.


💥పరీక్షల్లేకుండా ఆన్‌లైన్‌ పాఠాలు...


👉రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి.


 👉అందరిలోనూ భయాందోళన నెలకొంది. కోవిడ్‌-19 అధికమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. 


👉ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలను వాయిదా వేస్తూ, ప్రథమ సంవత్సరం విద్యార్థులను ప్రమోట్‌ చేసిన సంగతి తెలిసిందే. 


👉1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులందర్నీ పరీక్షల్లేకుండానే పాస్‌ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. 


👉రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేటు, Aided‌, గురుకులాలు కలిపి 40,898 పాఠశాలలున్నాయి. 


వాటిలో 59.26 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. పదో తరగతి విద్యార్థులు 5.21 లక్షల మంది ఉన్నారు. వారిని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తీర్ణులుగా ప్రకటించింది. ఇక ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు 54.05 లక్షల మంది ఉన్నారు. అయితే వారికి పాఠశాలల్లో ఆన్‌లైన్‌ పాఠాలు కొనసాగుతుండడం గమనార్హం. రోజూ ఉపాధ్యాయులు బడులకు వెళ్లాల్సి వస్తున్నది. కొందరు టీచర్లు కరోనా బారిన పడుతున్నారు. కానీ తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకూ పరీక్షల్లేవు. అయినా ఆన్‌లైన్‌ పాఠాలు నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.*


💥ఈ విద్యాసంవత్సరం అంతా గందరగోళం


💠విద్యారంగంపై కరోనా పంజా విసిరింది. ఈ రంగాన్ని అతలాకుతలం చేసింది.


👉 ప్రస్తుత విద్యాసంవత్సరం అంతా గందరగోళంగా కొనసాగింది. గత విద్యాసంవత్సరం నుంచి ఇప్పటి వరకు విద్యారంగంపై కోలుకోలేని దెబ్బపడింది. 


👉దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. వారి అభ్యసనా సామర్థ్యాలు, జ్ఞాపకశక్తి వంటి వాటిపై ప్రభావం పడింది. చాలా మంది విద్యార్థులకు గతంలో చదివినవేవీ గుర్తుకు రాని పరిస్థితి నెలకొంది.


👉 2020, మార్చి 16 నుంచి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. అప్పటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కాలేదు.*


👉గతేడాది జూన్‌ 12న పాఠశాలలు పున:ప్రారంభం కావాలి. కానీ కోవిడ్‌ కేసులు పెరగడం వల్ల అదీ సాధ్యం కాలేదు. 


👉పరిస్థితిని సమీక్షించిన ప్రభుత్వం విద్యార్థులకు నష్టం కలగకుండా ఉండేందుకు గతేడాది సెప్టెంబర్‌ ఒకటి నుంచి మూడో తరగతి నుంచి ఆపై తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలను బోధిం చేందుకు అనుమతి ఇచ్చింది.