Hot Posts

6/recent/ticker-posts

ఏపీలో పేదలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.2 లక్షలు లబ్ది.

💥ఏపీలో పేదలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.2 లక్షలు లబ్ది💥


👉రాష్ట్రంలో 1.50 కోట్ల బియ్యం కార్డు ఉన్న కుటుంబాలకు ప్రయోజనం కల్పించే ఈ పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.583.50 కోట్లు ఖర్చు
 చేయనుంది.

👉ముఖ్యంగా పేదల కోసం ఈ సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.

👉జగన్ సర్కార్ సంక్షేమంలో దూసుకెళుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు లబ్ది చేకూరేలా కొత్త సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.

👉తాజాగా పేదల కోసం మరో కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం లభించింది.

👉 బియ్యం కార్డు ఉండి కుటుంబం ఆధార పడ్డ వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆదుకునేందుకు వైఎస్సార్‌ బీమా పథకాన్ని అమలు చేయనుంది.

👉ముఖ్యంగా పేదల కోసం ఈ సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.

👉గతంలో ఎల్‌ఐసీతో కలసి కేంద్రం ఈ పథకాన్ని అమలు చేసేది. కానీ దీనిని కొద్ది రోజుల క్రితం ఉపసంహరించుకుంది.

👉అయితే పేదల కోసం ఈ పథకాన్ని పూర్తిగా సొంత నిధులతో అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.

👉రాష్ట్రంలో 1.50 కోట్ల బియ్యం కార్డు ఉన్న కుటుంబాలకు ప్రయోజనం కల్పించే ఈ పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.583.50 కోట్లు ఖర్చు చేయనుంది. బియ్యం కార్డుదారుల కుటుంబం ఆధారపడే 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వ్యక్తి సహజ మరణం పొందితే బాధిత కుటుంబానికి రూ.2 లక్షలు బీమా పరిహారం ఇస్తారు.

👉శాశ్వత వైకల్యం, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు ఇస్తారు. 51 – 70 ఏళ్ల వ్యక్తి శాశ్వత వైకల్యం పొందినా, ప్రమాదవశాత్తు మరణించినా బాధిత కుటుంబానికి రూ.3 లక్షలు అందుతాయి.