💥ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త.💥
👉తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు శుభవార్త చెప్పారు.
👉ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కలిగే విధంగా ముందడుగులు వేస్తోంది.
👉 మొదట రాష్ట్రంలోని రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల పాఠశాలలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
👉మిగతా జిల్లాల్లోను ఇంటర్నెట్, ఇతర సౌకర్యాలు కల్పించే విధంగా ముందడుగులు వేస్తోంది. విద్యాశాఖ పరిధిలోని సమగ్ర శిక్ష అభియాన్ అధికారుల నుంచి ఈ మేరకు డీఈవోలకు ఆదేశాలు జారీ అయ్యాయి.
👉 కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో మార్చి నెల మూడవ వారంలో మూతబడిన పాఠశాలలు ఇప్పటివరకు తెరచుకోలేదు.
👉కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా విద్యా బోధన కొనసాగుతోంది.
👉ఆన్ లైన్ బోధనకు అనుకూలంగా ఉండే విధంగా ఇంటర్నెట్ వసతి కల్పిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.
👉పట్టణ ప్రాంతాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నామని గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు పట్టణ ప్రాంతాల విద్యార్థులకు కలిగే ప్రయోజనాలన్నీ కలిగేలా చేస్తున్నామని తెలిపారు.
👉విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టామని అధికారులు చెప్పారు.
👉ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 లక్షలకుపైగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని సమాచారం.
👉ప్రైవేట్ పాఠశాలలు ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా బోధిస్తున్నాయి.
👉ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిన నేపథ్యంలో తెలంగాణ సర్కార్ పేద విద్యార్థులకు ఇంటర్నెట్, ఇతర సౌకర్యాలు అందేలా చేసి వారికి మెరుగైన సౌకర్యాలు కలిగేలా చర్యలు చేపట్టింది.
👉 మరోవైపు వేగంగా విజృంభిస్తున్న వైరస్ వల్ల విద్యార్థులు పనిదినాలు నష్టపోవడంతో పని దినాలు భర్తీ అయ్యేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలను రూపొందిస్తున్నాయి.
Social Plugin