NHAI recruitment notification 2021
NHAI recruitment notification 2021
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ మొత్తం 41 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం 41 పోస్టులను ప్రకటించారు.
పోస్ట్ పేరు: డిప్యూటీ మేనేజర్(టెక్నికల్).
కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు:
1. ఆన్ రిజర్వుడ్ లో - 18,
2. ఎస్సీ లకు - 6,
3. ఎస్టీ లకు - 4,
4. ఓబీసీ లకు - 10,
5. EWS లకు - 03.
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
వయసు: డిప్యూటీ మేనేజర్(టెక్నికల) ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 30సంవత్సరాలకు మించకూడదు. అధిక వయసు కలిగిన అభ్యర్థులకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు.
ఎంపిక ప్రక్రియ:
గేట్ 2021 సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో సాధించిన స్క్వేర్ ఆధారంగా, మరియు అవసరాన్ని బట్టి ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించే అధికారం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు ఉంటుందని ప్రకటనలో తెలిపింది...
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
1. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
2. అధికారిక వెబ్ సైట్ లింక్:
3. Google Chrome, Mozilla Firefox ల లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
4. అధికారిక వెబ్ సైట్ లో కనిపిస్తున్నటువంటి ABOUT NHAI లింక్ పై క్లిక్ చేసి, వేకెన్సీ ను ఎంపిక చేసుకొని, CURRENT పై క్లిక్ చేయండి.
5. పేజీ ను కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి.
6. అధికారిక నోటిఫికేషన్ కనిపిస్తుంది. పక్కనే ఉన్నటువంటి Apply Now లింక్ పై క్లిక్ చేయండి.
7. అధికారిక అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది.
8. సంబంధిత వివరాలను ఎంటర్ చేసి, ఫోటో, సంతకం, పుట్టిన తేదీ రుజువు పత్రం, సివిల్ ఇంజనీరింగ్ సర్టిఫికెట్, గేట్ 2021 స్కోరు కాఫీ లను Upload చేసి NEXT బటన్ పై క్లిక్ చేయండి.
9. దరఖాస్తు ఫామ్ preview కనిపిస్తుంది.
10. ఈ విధంగా దరఖాస్తులను 28.05.2021 సాయంత్రం 06:00 గంటల లోపు ఆన్లైన్ చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 28.05.2021.
అధికారిక వెబ్సైట్: https://nhai.gov.in/#/
Social Plugin