Hot Posts

6/recent/ticker-posts

Is there account in sbi? The more charges, the more expensive they are!

 SBI లో ఖాతా ఉందా? ఇక చార్జీలు త‌డిసిమోపెడే!






జూలై ఒక‌టో తేదీ నుంచి కొత్త సర్వీసు ఛార్జీలు వసూలు చేయనుంది.



👉 దేశంలోకెల్లా అతిపెద్ద వాణిజ్య బ్యాంక్‌.. భార‌తీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ).. త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు నిరాశ క‌లిగించే విష‌యం ఒక‌టి బ‌య‌ట‌పెట్టింది.



 👉బేసిక్‌ సేవింగ్స్‌ అంటే జీరో బ్యాలెన్స్‌ ఖాతా (బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్-BSBD) కల‌వారి నుంచి వ‌చ్చే జూలై ఒక‌టో తేదీ నుంచి కొత్త సర్వీసు ఛార్జీలు వసూలు చేయనుంది.



👉నగదు ఉపసంహరణ, చెక్‌బుక్‌పై పరిమితులు విధించామ‌న్న‌ది. 



👉ఆ పరిధి దాటితే రుసుముల వ‌సూళ్లు వర్తిస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది.




👉ఏదేనీ SBI  శాఖ‌లోగానీ, ATM లోగానీ మొత్తం నాలుగు సార్లు మాత్రమే ఉచితంగా నగదు విత్ డ్రాయ‌ల్‌కు అనుమతి ఇచ్చింది. 



👉అంతకంటే ఎక్కువ సార్లు నగదు తీసుకోవాలనుకుంటే.. ప్రతిసారి రూ.15లతో పాటు GST అదనంగా చెల్లించాలి.




👉ఇతర బ్యాంకుల‌ ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా చేసుకున్నా ఇవే ఛార్జీలు వర్తిస్తాయి. 



👉ఇకపై SBI ఖాతాదారులు ఎస్బీఐయేతర ఏటీఎంలు, SBI శాఖ‌తో కలిపి ఒక నెలలో నాలుగు సార్లు మాత్రమే డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది.




👉ఇక BSBD ఖాతాదారుల‌కు ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లీవ్స్‌తో కూడిన చెక్‌బుక్‌ను ఎస్బీఐ ఉచితంగా అందజేస్తుంది. 



👉అంతకంటే ఎక్కువ లీవ్స్ గ‌ల చెక్ బుక్ కావాలంటే అద‌న‌పు చార్జీలు చెల్లించాల్సిందే. 



👉10 లీవ్స్ కల చెక్‌బుక్‌కు రూ.40లతోపాటు అదనంగా జీఎస్టీ చెల్లించాలి.




👉ఒకవేళ 25 చెక్‌ లీవ్స్ కలిగిన బుక్‌ కావాలంటే జీఎస్టీతో పాటు రూ.75 కట్టాలి.


 👉ఒకవేళ అత్యవసరంగా చెక్‌ బుక్ కావాలని కోరితే.. 10 లీవ్స్‌కి రూ.50+జీఎస్టీ చెల్లించాలి. 


👉అయితే, సీనియర్‌ సిటిజన్లకు మాత్రం చెక్‌ బుక్‌ ఛార్జీలు వర్తించబోవ‌ని SBI వెల్ల‌డించింది.