👉రాష్ట్రంలో లాక్‌డౌన్ నేపథ్యంలో పోస్టాఫీసుల్లో వినియోగదారుల సేవల సమయాలను తపాలా శాఖ కుదించింది.
👉ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెద్ద పోస్టాఫీసుల్లో కౌంటర్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, చిన్న పోస్టాఫీసుల్లో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు పనిచేస్తాయని అధికారులు వెల్లడించారు.
👉డెలివరీతో సహా ఇతర సేవలు గతంలో మాదిరిగానే కొనసాగుతాయని స్పష్టం చేశారు.
12 గంటల వరకే బ్యాంకులు
లాక్‌డౌన్ దృష్ట్యా బ్యాంకుల పనివేళల్లో మార్పులు చేశారు.
గురువారం నుంచి బ్యాంకులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకూ పనిచేస్తాయి.
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సూచనల మేరకు కుదించిన పనివేళల్లో నగదు డిపాజిట్, విత్‌డ్రాయిల్, చెక్కుల క్లియరెన్స్, రెమిటెన్సులు, ప్రభుత్వ కార్యకలాపాలు మాత్రమే నిర్వహించనున్నట్లు స్టేట్‌లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) కన్వీనర్ క్రిషన్ శర్మ చెప్పారు.
ఉదయం 6 గంటల నుంచి 10 గంటలవరకే ప్రజలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు వున్నందున, రోజంతా తెరిచినప్పటికీ ఉపయోగం లేదన్న కారణంగా బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి రామకృష్ణ తెలిపారు.
Social Plugin