Hot Posts

6/recent/ticker-posts

హైదరాబాద్ వాసులకు RTC బంపరాఫర్.

🔥హైదరాబాద్ వాసులకు RTC బంపరాఫర్.🔥

 👉హైదరాబాద్: నగర ప్రజలకు గ్రేటర్ ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది.

👉బస్‌ పాస్‌ల కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచిచూడకుండా ఒక్క ఫోన్ కాల్‌తో ఇంటికే పంపిచే సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. 

👉8008204216 నంబరుకు ఫోను చేస్తే అపార్టుమెంట్‌, కాలనీ, మాల్‌, కార్యాలయం, కంపెనీ, పారిశ్రామిక వాడ ఇలా ఎక్కడున్నా మీకు అందించే బాధ్యత తమదని RTC గ్రేటర్‌హైదరాబాద్‌ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. 

👉అయితే 5గురికి తగ్గకుండా పాస్ తీసుకోవాలన్న నిబంధన పెట్టినట్లు RTC అధికారులు తెలిపారు. 

👉ఈ సౌకర్యం కోసం అదనంగా ఒక్క రూపాయి చెల్లించాల్సిన పని లేదని చెప్పారు. అలాగే నగరంలో 31 బస్సు పాస్‌ కేంద్రాలను కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.

👉ఈ కేంద్రాలు ఉదయం 7.30AM గంటల నుంచి రాత్రి 8.15 pm గంటల వరకూ పని చేస్తాయి..

🔥బస్ పాస్ ధరలు ఇలా ఉన్నాయి:

👉ఆర్డినరీ - 950

👉మెట్రో ఎక్స్‌ప్రెస్ - 1070

👉మెట్రో డీలక్స్ - 1185

👉ఎయిర్‌పోర్ట్ పుష్పక్ - 2625

👉ఎన్‌జీవో ఆర్డినరీ - 320

👉ఎన్‌జీవో మెట్రో ఎక్స్‌ప్రెస్ - 450

👉ఎన్‌జీవో మెట్రో డీలక్స్ - 575