Hot Posts

6/recent/ticker-posts

February 15th తర్వాత ఆ తరగతులకు కూడా.? విద్యాశాఖ ప్రాథమిక నిర్ణయం. .

తెలంగాణ Schools Re open:-

కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా తెలంగాణలో మూతపడిన విద్యా సంస్థలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తెరుచుకోనున్నాయి. 9th class నుంచి ఆపై తరగతులకు క్లాసులు నిర్వహించేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది... కరోనా జాగ్రత్తలతో పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, విద్యాసంస్థలు తెరుచుకోనుండగా.. ఇంటర్ కళాశాలలు షిఫ్ట్ పద్దతిలో.... డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కాలేజీలు రోజుకు సగం మంది విద్యార్ధులతో ప్రారంభం కానున్నట్లు సమాచారం... ఇదిలా ఉంటే ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 6th,7th,8th class లకు కూడా క్లాసులు ప్రారంభించాలని విద్యాశాఖ ప్రాధమికంగా నిర్ణయించినట్లు సమాచారం... ఈ మేరకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి కూడా పంపించిందట. మరి దీనిపై CM కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. కాగా, ఈ ఏడాది 1st class నుంచి 5వ class వరకు బడులు ఉండవు. ఆయా తరగతుల విద్యార్ధులకు క్లాసులు నిర్వహించకుండానే ప్రమోట్ చేయనున్నారు.