School ల రీ ఓపెన్ పై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం.
తెలంగాణ రాష్ట్రంలో second wave , అలాగే corona కొత్త రకం వైరస్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతోంది.. తెలంగాణ ప్రభుత్వం .
👉ఇదే సమయంలో కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ కూడా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యేలా చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు,, ట్రేసింగ్., టెస్టింగ్,, ట్రీటింగ్ విధానం అనుసరిస్తున్నామని అధికారులు వెల్లడిస్తున్నారు..
👉1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు స్కూల్స్ తెరవొద్దని ప్రభుత్వ నిర్ణయం.
👉ఆయా తరగతుల వరకు నేరుగా ప్రమోట్ చేసే అవకాశం ఉంది. కరోనా సెకండ్ వేవ్ హెచ్చరికతో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఈ మేరకు స్కూళ్ల బంద్ నిర్ణయం తీసుకుంది. స్కూళ్ల బంద్ నిర్ణయం ప్రైవేట్ విద్యా సంస్థలకు కూడా వర్తించనుంది.
👉ఈ విద్యా సంవత్సరం ఇప్పటివరకు స్కూల్స్ ప్రారంభమే కాలేదు.
👉అయినప్పటికీ ఈ విద్యా సంవత్సరం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు స్కూల్స్ తెరవొద్దని ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయం తీసుకుంది.
👉1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు ఆయా తరగతులకు నేరుగా ప్రమోట్ చేసే అవకాశం.. ఈ నిర్ణయంతో కనిపిస్తోంది.
👉కరోనా సెకండ్ వేవ్ హెచ్చరికతో అప్రమత్తమైన ప్రభుత్వం మేరకు schools బంద్ చేయాలని నిర్ణయం తీసుకుంది.
👉ఈ నిర్ణయం ప్రైవేటు విద్యాసంస్థలకు కూడా వర్తించనున్నట్లుగా తెలుస్తూ ఉంది..
👉కరోనా కొత్త స్ట్రెయిన్ విషయంలో తెలంగాణా అలెర్ట్ .. UK నుండి వచ్చిన వారికి పరీక్షలు.
👉ఇదే సమయంలో కరోనా కొత్త వైరస్ స్ట్రెయిన్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఇటీవల నెలరోజులుగా యూకే నుంచి వచ్చిన వారి వివరాలను సేకరించి.. వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్ వెల్లడించారు.
👉డిసెంబర్ 9 నుండి ఇప్పటి వరకు 1200 మంది UK(లండన్ ) నుండి తెలంగాణకు వచ్చినట్లు గుర్తించామని వారి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు.
👉అందరికీ వైద్య పరీక్షలు చేస్తున్నామని వెల్లడించారు .
👉ఆందోళన వద్దన్న హెల్త్ డైరెక్టర్ .. జాగ్రత్తలు పాటించాలని సూచన..
👉UK నుండి వచ్చిన వారికి ఇప్పటివరకు జరిగిన పరీక్షలలో ఎవరికి కొత్త కరోనా వైరస్ జాతి నిర్ధారణ కాలేదు అన్నారు.
👉 కొత్త రకం కరోనా వైరస్ తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు.
👉మాస్కులు తప్పనిసరిగా వాడాలని , సామాజిక దూరం పాటించాలని, ప్రజలు సహకారం అందిస్తే కరోనా వ్యాప్తిని అడ్డుకోగలమని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
👉కరోనా సెకండ్ వేవ్ , అలాగే కొత్త కరోనా స్ట్రెయిన్ కారణంగా నెలకొన్న ఆందోళన నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం విద్యార్థుల రక్షణకు తగిన చర్యలు తీసుకుంటుంది...
Social Plugin