💥భూమి లేని రైతులకు SBI శుభవార్త💥
👉దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఓ సరికొత్త స్కీంను ప్రకటించింది. వ్యవసాయం చేయాలనుకునే యువతకు ఈ స్కీం ఎంతో ఉపయుక్తంగా మారనుంది. 'ల్యాండ్ పర్చేజ్ స్కీం' పేరిట రుణాలు అందిస్తోంది.
👉 ఈ స్కీంలో భాగంగా వ్యవసాయ భూమిని కొనుగోలు చేయవచ్చు. మీరు భూమి విలువలో కేవలం 15 శాతం డబ్బులు చెల్లిస్తే చాలు. 85 శాతం మొత్తానికి బ్యాంక్ లోన్ అందిస్తుంది.
👉అంతేకాకుండా తీసుకున్న రుణాన్ని 7 నుంచి పదేళ్లలోపు తిరిగి చెల్లిస్తే చాలని ప్రకటించింది. తీసుకున్న రుణాన్ని చెల్లించిన తర్వాత.
👉మీకు భూమిపై యాజమాన్య హక్కు లభిస్తుంది. దీనివల్ల సన్నకారు రైతులకు, పొలం లేని వారికి మేలు కలుగనుంది.
👉ఈ స్కీం కింద లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని భావిస్తే..
👉బ్యాంక్‌కు ఎలాంటి అప్పు ఉండకూడదు.
👉ఈ స్కీం కోసం 2.5 ఎకరాల కన్నా తక్కువ పొలం ఉన్న రైతులే అర్హులు అవుతారు. వారే దరఖాస్తు చేసుకోవచ్చు.
👉అంతేకాకుండా పొలం లేనివారు కూడా లోన్ కోసం అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది.
👉మరోవైపు ఈ స్కీం కింద లోన్ తీసుకుంటే ఏడాది నుంచి రెండేళ్ల వరకు ఎలాంటి డబ్బులు చెల్లించకుండా హాలిడే పేమెంట్ బెనిఫిట్ కూడా లభిస్తుంది. కాగా,
👉కరోనా వైరస్ దెబ్బకి సజావుగా సాగుతున్న ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా తలకిందులైంది.
👉పట్టణాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నవారు పల్లెబాట పట్టారు. కొందరు వర్క్ ఫ్రం హోమ్‌లో ఉద్యోగాలు చేస్తున్నా..
👉చాలామంది సంస్థలు మూతపడటంతో ఉద్యోగాలు కోల్పోయారు. ఊరికి వచ్చి ఆ పనీ ఈ పని చేసుకుంటున్నారు.
👉ఈ క్రమంలో భూములు ఉన్నవారు పొలంబాట పట్టారు. పలుగులు, పారలు పట్టి పొలాల్లోకి వెళ్లి నడుములు వంచుతున్నారు. అలాంటివారికోసమే ఎస్బీఐ ఈ సరికొత్త స్కీంను అందుబాటులోకి తీసుకువచ్చింది.
Social Plugin