Hot Posts

6/recent/ticker-posts

Top 100 Indian History bits for All Competitive exams

 

Top 100 Indian History bits for All Competitive exams


 1. సింధూ ప్రజల ప్రధాన రేవుపట్టణం లోథాల్‌ ఏ రాష్ట్రంలో ఉంది ? - గుజరాత్‌


2. సింధూ ప్రజల ముద్రికలను (సీల్స్‌) దీనితో తయారుచేశారు? - స్టీయటైట్‌


3. హరప్పా, మెసపటోమియాల మధ్య వర్తక కేంద్రంగా ఉన్న ప్రాంతమేది ? - డెల్మన


4. భారతదేశంపై దండయాత్ర జరిపిన మొట్టమొదటి దురాక్రమణదారుడు ? - డేరియస్‌


5. సింధూ ప్రజల పాలకులు ఎవరు ? - పూజారులు


6. 'ది ఆర్కిటెక్‌ హోమ్‌ ఆఫ్‌ ద వేదాస్‌' గ్రంథ రచయిత ఎవరు? - బాలగంగాధర్‌ తిలక్‌


7. ఆర్యుల గురించి తెలిపే అత్యుత్తమ ఆధారం ? - రుగ్వేదం


8. వ్యవసాయ కార్యకలాపాల గురించి ఏ వేదంలో ఉంది ? - అధర్వణవేదం


9. రుగ్వేదకాలంనాటి బంగారు నాణెం ? - నిష్క


10. రుగ్వేదకాలంలో నాలుగు ప్రజాభిప్రాయాల్ని ప్రతిబింబించే సంస్థలు ఉండేవి.. అవి ఏవి ? - సభ, సమితి, గణ, విధాత


11. కులాప అంటే ఎవరు ? - కుటుంబానికి పెద్ద 


12. రుగ్వేదకాలంలో రాజులకు ప్రజలు చెల్లించే రక్షణ సుంకం పేరు ? - బలి 


13. ప్రప్రథమంగా రాజ్యాధికారం లేదా రాచరిక వ్యవస్థ గూర్చి ప్రస్తావించిన గ్రంథం ? - ఐతరేయ బ్రాహ్మణం 


14. భౌద్ధమత గ్రంథాలు ? -త్రిపీటకాలు (వినయపీటక, సుత్తపీటక, అభిదమ్మపీటక) 


15. బుద్ధుని పూర్వ జీవితం గూర్చి చెప్పే కథలు ఏమిటి ? - జాతకకథలు 


16. మహాభారతానికి గల ఇతర పేర్లు ? - జయసంహిత, పంచమవేద, సంహిత 


17. జైనమత స్థాపకుడు ? - రుషభనాథుడు 


18. శూన్యవాదాన్ని ప్రతిపాదించే మాధ్యమిక వాదానికి మూల పురుషుడు ? - ఆచార్య నాగార్జునుడు 


19. గ్రీకులు మరియు భారతీయ శిల్పరీతుల సమ్మిళిత ఫలితంగా ఏర్పడిన కళ ? - గాంధారశిల్పకళ


20. ఒడిషాలో జైనమత వ్యాప్తికి కృషిచేసిన మహరాజు ? - ఖారవేలుడు 


21. అద్వైతాన్ని ఎవరు ప్రచారం చేశారు ? - ఆదిశంకరాచార్యుడు 


22. వీరశైవ మతం ప్రచారం చేసింది ఎవరు ? - బసవేశ్వరుడు 


23. పాటలీపుత్ర నగర నిర్మాత ఎవరు ? - అజాతశత్రువు 


24. మౌర్యులు ఏ తెగకు చెందినారు ? - మోరియ 


25. చంద్రగుప్తుడి ఆస్థానంలో సెల్యుకస్‌ నికేటర్‌ రాయబారి ? 

- మెగస్తనీస్‌ (అర్ధశాస్త్ర-గ్రంథకర్త) 


26. అశోకుని శాసనాలను మొదటిగా చదివి వినిపించినదెవరు ? - 1837 సంవత్సరంలో ఈస్టిండియా 


27. మౌర్యుల సామ్రాజ్యాన్ని 04 రాష్ట్రాలుగా విభజించారు. అవి ఏవి ? - తక్షశిల, ఉజ్జయిని, తోసాలి, సువర్ణగిరి 


28. ఏ శాసనాన్ని బట్టి అశోకుడు బౌద్ధమతం స్వీకరించినట్లు తెలుస్తుంది ? -బభ్రుశాసనం 


29. మౌర్యుల అధికారభాష ? - ప్రాకృతం 


30. భారతదేశం అధికార చిహ్నం అశోకుని ఏ స్థూపం నుంచి స్వీకరించబడింది ? - సారనాథ్‌ 


31. అశోకుడు 'ప్రజలందరూ నా బిడ్డలు' (ఆల్‌ మెన్‌ ఆర్‌మై చిల్డ్రన్‌) అని ఏ శాసనంలో ప్రకటించాడు ? - ధౌళీశాసనం 


32. అశోకుడు రాజ్యానికి రాకముందు ఏ ప్రాంతానికి రాజప్రతినిధి ? -ఉజ్జయిని 


33. మౌర్యుల కాలంలో సివిల్‌ కోర్టుల పేర్లు ? - ధర్మస్థేయ 


34. కాశ్మీర చరిత్రకారుడైన కల్హణుని రాజతరంగిణి ప్రకారం అశోకుడు ఏ పట్టణాన్ని స్థాపించాడు ? - శ్రీనగర్‌ 


35. అశోకుని బిరుదులు ? దేవానాంప్రియ, ప్రియదరిశ్మిని 


36. అశోకుడు ఏ బౌద్ధాచార్యుని దగ్గర బౌద్ధమతదీక్షను స్వీకరించాడు ? - ఉపగుప్తుడు 


37. పురుషోత్తముడు అలెగ్జాండర్‌ను ఏనది ఒడ్డున ఎదుర్కొన్నాడు ? - జీలం 


38. మౌర్యుల కాలంలో 'కార్షాపణం' అనే నాణేన్ని ఏ లోహంతో తయారు చేశారు ? - రాగి 


39. మౌర్యుల కాలంలో పన్నులను ఆహారధాన్యాలు, పశువులు, బంగారం రూపంలో చెల్లించిన గ్రామాలు ఏవి ? - హిరణ్యగ్రామాలు 


40. మౌర్యుల కాలంలో రెవెన్యూ న్యాయాధికారాలను ఎవరు నిర్వహించేవారు ? - రజుక (నేడు జిల్లా కలెక్టర్‌ మాదిరి) 


41. నంద వంశస్థాపకుడు ? - మహాపద్మనందుడు 


42. శుంగ వంశస్థాపకుడు ? - పుష్యమిత్రశుంగుడు 


43. కాళిదాసు-రచనలు - రఘువంశం, కుమారసంభవ, మేఘదూత, మాళవికాగ్నిమిత్ర, అభిజ్ఞాన శాకుంతలం 


44. కణ్వవంశ స్థాపకుడు ? - వాసుదేవ కణ్వుడు 


45. 'విలువైన రాళ్లకు తల్లి' అని భారతదేశాన్ని పేర్కొన్న గ్రీకు రచయిత ? - ప్లీని 


46. శాతవాహన వంశ స్థాపకుడు ? - శ్రీముఖుడు 


47. గుణాఢ్యుడు ఏ భాషలో బృహత్కథను రచించాడు ? - పైశాచిక భాషలో 


48. శాతవాహన రాజులలో హలుడు ఎన్నోవాడు ? 17వ వాడు  


49. గౌతమీపుత్రశాతకర్ణి బిరుదులు ? 

- త్రిసముద్రతో యపీతవాహన, త్రిసముద్రాధిపతి, ఏకబ్రాహ్మణ, క్షహరాటవంశ నిరశశేషకరుడు, శాతవాహనకుల యశస్యుడు, ప్రతిష్టాపనకరుడు, క్షత్రియ దర్పమానవమర్ధనుడు, పరావారణ విక్రయచారు వినముడు.


50. మౌర్యుల కాలంలో క్రిమినల్‌ కోర్టుల పేర్లు ? - కంటకశోధన


51. శాతవాహన రాజులలో హలుడు రచించిన గ్రంథం ? గాథాసప్తశతి (ఇతడు 700 గాథలను సేకరించి గాథాసప్తశతి అనే పేరుతో ప్రాకృత భాషలో ఒక కావ్యాన్ని రచించాడు. ఆయనకు 

కవి వత్సలుడు అనే బిరుదు ఉంది.)


52. నౌకాచిహ్నంగల నాణేలు వేయించిన శాతవాహనరాజు ? 

- యజ్ఞశ్రీశాతకర్ణి 


53. రాక్షసగుళ్లు అనేవి (మాగలిథ్స్‌) ? - ప్రాచీన మానవుల సమాధులు 


54. 'భారతదేశపు ఐన్‌స్టీన్‌' 'రెండో బుద్ధుడు' అని ఎవరిని అంటారు ? - నాగార్జునుడు 


55. సార్థవాహులు అనగా ? -విదేశాలలో వ్యాపారం చేసేవారు 


56. అమరావతి స్తూపాన్ని 1797లో కనుగొన్న ఆంగ్లేయుడు ఎవరు ? - కల్నల్‌ మెకంజి 


57. ఆంధ్రదేశ పరిస్థితులను సి-యు-కి గ్రంథంలో వివరించిన చైనాయాత్రీకుడు ఎవరు ? 

- హ్యూయన్‌సాంగ్‌ (7వ శతాబ్దం) 


58. 'సంగం' అంటే ఏమిటి ? - మధురై పట్టణంలో ప్రాచీనకవి పండిత పరిషత్‌ 


59. ఇలంగో అడిగల్‌ రాసిన ప్రముఖ గ్రంథం ? - శిలప్పాదిగారం 


60. మణిమేఖలను రచించినది ఎవరు ? - సిత్తనైసత్తెవార్‌ 


61. సంగం యుగంలోని కృత్రిమ రేవుపట్టణం ఏది ? - పుహార్‌ 


62. రుద్రదాముని సైనిక విజయాలు ఎందులో ఉన్నాయి ? 

- గిర్నార్‌ శాసనం (శుద్ధసంస్కృతంలో మొదటి అతిపెద్ద శాసనం) 


63. ఖారవేలుని గురించి తెలిపే ప్రసిద్ధ శాసనం ? - హథిగుంప


64. మనదేశ చరిత్రలో తొలిసారిగా బంగారు నాణేలను ప్రవేశపెట్టింది ? 

-ఇండోగ్రీకులు 


65. క్రీ.శ 78తో ప్రారంభమయ్యే శాతివాహన శకాన్ని ఎవరు ప్రారంభించారు? - కనిష్కుడు 


66. 'దేవపుత్ర' సీజర్‌ అను బిరుదులు ఎవరికి కలవు ? - కనిష్కుడు 


67. బుద్ధచరిత్ర, సౌందర్యనందము అనే గ్రంథాలు రాసినది ఎవరు ? - అశ్వఘోషుడు 


68. కుషానులు ఏ తెగకు చెందినవారు ? - యూచీ (అర్థం - చంద్రుని తెగ) 


69. కనిష్కుని కాలంలో జరిగిన నాలుగో బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగింది ? - కాశ్మీర్‌


70. గుప్తుల రాజ్యనిర్మాత, సామ్రాజ్య స్థాపకుడు ? - మొదటి చంద్రగుప్తుడు


71. చరిత్రకారుడు 'స్మిత్‌' 'భారతీయ నెపోలియన్‌' అని ఎవరిని సంబోధించాడు ? -సముద్రగుప్తుడు


72. మనదేశంలో మొదటిసారిగా వెండి నాణేలను వేసింది ?

- కుషానులు


73. రెండో చంద్రగుప్తుని బిరుదులు ? -పరమభాగవతి, విక్రమాదిత్య, సాహసాంక, శకారి


74. సంస్కృత సాహిత్యాన్ని అభివృద్ధి చేసిన 'నవరత్నాలు' అనే కవులు ఎవరి ఆస్థానంలో ఉన్నారు ? -రెండో చంద్రగుప్తుని


75. రాజధానిని పాటలీపుత్రం నుంచి ఉజ్జయినికి మార్చినది ? - రెండో చంద్రగుప్తుడు


76. సింహం బొమ్మ నాణేలాను వేయించింది ? - రెండో చంద్రగుప్తుడు


77. 'అంగ్‌కోర్‌వాట్‌' దేవాలయం ఎక్కడ ఉంది ? - కంబోడియా


78. 'స్కంధవారాలు' అంటే ఏమిటి ? - మిలటరీ క్యాంపులు


79. రాష్ట్రకూటుల మాతృభాష ? - కన్నడం


80. చోళుల కాలంలో గ్రామసభలను ఏమని పిలిచేవారు ? - ఉర్‌


81. బదామి చాళుక్యులలో అతిగొప్పవాడు ? - రెండో పులకేశి


82. రెండో పులకేశి జీవిత చరిత్రకు, విజయాలకు ముఖ్యమైన ఆధారం ? - ఐహోలు శాసనం


83. నవీన పల్లవుల మూలపురుషుడు ? - సింహవిష్ణువు


84. పల్లవుల రాజధాని ? - కాంచీపురం


85. 'ఐదు పగోడాలకు' పేరుగాంచిన మహాబలిపురం పట్టణాన్ని నిర్మించింది ఎవరు ? - మొదటి నరసింహవర్మ


86. 'మత్తవిలాస ప్రహసనం' గ్రంథకర్త ఎవరు ? - రెండో మహేంద్రవర్మ


87. రాష్ట్రకూట రాజ్యస్థాపకుడు ? - దంతిదుర్గుడు


88. కవిపోషకుడు మరియు కన్నడంలోని మొట్టమొదటి అలంకార గ్రంథం 'కవిరాజమార్గాన్ని' రచించింది ? - అమోఘవర్షుడు


89. అమోఘవర్షుని దర్శించిన అరబ్‌ యాత్రీకుడు ? 

- సులేమాన్‌


90. ఎల్లోరాలోని కైలాసనాథ దేవాలయం, ఎలిఫెంటాదేవాలయం నిర్మాత ? - మొదటి కృష్ణుడు


91. 'వీరశైవుద్యమం' ప్రారంభించిన బసవేశ్వరుడు ఏ కాలంనాటి వాడు ? - కల్యాణి చాళుక్యుల కాలం


92. చోళ రాజ్యస్థాపకుడు ? -విజయాలయుడు


93. తంజావూర్‌లోని బృహదీశ్వరాలయాన్ని నిర్మించింది ? 

- మొదటి రాజరాజు


94. గంగైకొండ చోళపురాన్ని నిర్మించింది ? - రాజేంద్రుడు


95. 'కడగం' అంటే ? - చోళుల సైనిక శిబిరం


96. దక్షిణ దేశపు నెపోలియన్‌ (ది సదరన్‌ నెపోలియన్‌) అని ఏ చోళరాజును వర్ణిస్తారు ? - రాజేంద్రచోళుడు


97. చోళుల గ్రామపాలనా పద్ధతిని తెలిపే శాసనం ? - మొదటి పరాంతకుని ఉత్తరమేరూర్‌ శాసనం


98. 'తాన్‌కుర్రం' అంటే ఏమిటి ? -పురపాలక సంఘం


99. గ్రీకువీరుడు అలెగ్జాండర్‌ ఏ ప్రాంతానికి చెందినవాడు ? - మాసిడోనియా


100. ఎప్పుడు విక్రమ సంపత్‌ (యుగం)ను, ఉజ్జయినీ రాజు విక్రమాదిత్యుడు ప్రారంభించాడు ? -క్రీ.పూ 58


101. మొదటి తరైన్‌ యుద్ధం ఎప్పుడు జరిగింది ?

 - క్రీ.శ 1191 సంవత్సరం, పృద్వీరాజ్‌ చౌహాన్‌ వర్సెస్‌ ఘోరీ




-------------------------------------------------------------------------




TS Gurukula 5th class  worksheets practice కొరకు :-


👇👇👇


CLICK HERE



::::::::::::::::::::::::::::::::::::::::::::::+:::::::::::::::::::::::::::::::::



Telugu  Spelling words test కొరకు :-


👇👇👇


CLICK HERE