How to get e-pass for inter district and inter state journey in lockdown in Telangana
💥కోవిడ్19 యొక్క వ్యాప్తిని నిలువరించుటకు తెలంగాణలో లాక్‌డౌన్ ప్రకటించినందున, ఏదైనా అత్యవసర అంతర్-జిల్లా లేదా అంతర్-రాష్ట్ర ప్రయాణాలకు ముందస్తు అనుమతి/e-పాస్ తప్పనిసరి.
👉తెలంగాణలో ఈ-పాస్ కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి...
👉తెలంగాణ ప్రభుత్వం పది రోజుల పాటు లాక్‌డౌన్ విధించింది.
👉లాక్‌డౌన్ సమయంలో ఎవరూ బయటకు రావొద్దని కచ్చితమైన నిబంధనలు విధించింది.
👉అయితే లాక్‌డౌన్ సమయంలో అత్యవసరంగా ప్రయాణాలు చేసే వాళ్లు ముందుగా ఈ-పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
👉అత్యవసర పరిస్థితుల్లో అందచేసే e-pass లకు కోసం కింద ఇచ్చిన వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు పేర్కొన్నారు.
👉 ఎమర్జెన్సీ పరిస్థితులకు గాను లాక్‌డౌన్ సడలించిన సమయంలో కాకుండా ఇతర సమయాల్లో ప్రయాణించే వారికి మాత్రమే పాసులను జారీ చేస్తామని తెలిపారు.
👉లాక్‌డౌన్ సడలింపు సమయమైన ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు ప్రయాణించే వారికి ఏవిధమైన పాసులు అవసరం లేదని స్పష్టం చేశారు.
👉మిగతా సమయంలో ప్రయాణించే వారు మాత్రం వెబ్‌సైట్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
👉e-pass ధరఖాస్తు కోసం మొదట ఈ-పాస్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఈ-పాస్ మీద క్లిక్ చేయాలి.
👉తరువాత మీరు ప్రస్తుతం నివసిస్తున్న జిల్లా/కమిషనరేట్‌ను ఎంపిక చేసుకోవాలి.
👉ఆ తర్వాత మీ పేరు, adhar number , వాహనం, ఎంతమంది, పాస్ ఎందుకు, దేని కోసం, phone numbers , మీరు వెళ్లాల్సిన పోలీస్ స్టేషన్ పరిధి, Distance , తదితర వివరాలతోపాటు..
👉Photo , purpose document, KYC Form లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
👉ఇవన్నీ చేసిన తరవాత తర్వాత మీకు ఒక acknowledgment number వస్తుంది.
👉 ఇప్పుడు మీరు వెనక్కి వెళ్లి సిటిజన్ ప్రింట్ పాస్ క్లిక్ చేసి రశీదు సంఖ్య నమోదు చేసుకోవాలి.
👉మీరు వెళ్లాలి అనుకున్న ప్రాంతాల్లోకి కమిషనరేట్, ఎస్పీల నుంచి ఈ పాస్ మంజూరు అవుతుంది. ఈ పాస్ చూపించి లాక్‌డౌన్ సమయంలో ప్రయాణం చేయండి .
👉ఈ e-పాస్ ను సిటిజెన్ సర్వీస్ పోర్టల్నుండి సంబంధిత పత్రాలను సమర్పించి పొందగలరు.
కావలసిన డాక్యుమెంట్స్ :-
👇👇
1.Adhar,
2.Photo,
3.Purpose Document.
👉కింది చిత్రాల ఆధారంగా మీరు దరఖాస్తు నింపవచ్చు.
👉 సిటిజన్ సర్వీస్ పోర్టల్ కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి.
👇👇👇
Click here
==================================
Social Plugin