Blue Moon: నేడు అకాశంలో కనిపించనున్న బ్లూ మూన్.. అసలు బ్లూ మూన్ అంటే ఏమిటి??
👉Saturday (అక్టోబర్ 31) రాత్రి బ్లూ మూన్ దర్శనం ఇవ్వనుంది. రాత్రి 8.19 గంటల నుంచి బ్లూ మూన్ ఆకాశంలో కనిపించనుంది...
👉బ్లూ మూన్ అనేసరికి చాలా మందికి చంద్రుడు నీలి రంగులో దర్శనమిస్తాడా అనే సందేహం కలుగుతుంది!.
👉Saturday (October 31) రాత్రి బ్లూ మూన్ దర్శనం ఇవ్వనుంది. రాత్రి 8.19 నిముషాల నుంచి బ్లూ మూన్ ఆకాశంలో కనిపించనుంది.
👉Blue moon అనేసరికి చాలా మందికి చంద్రుడు నీలి రంగులో దర్శనమిస్తాడా అనే సందేహం కలుగుతుంది. మరికొందరి బ్లూ మూన్ అంటే ఏమిటో అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
👉అయితే Bluemoon అంటే... పౌర్ణమి రోజున కనిపించే ప్రకాశంతమైన చంద్రుడే. కాకపోతే ఒకే నెలలో రెండు పౌర్ణమిలు వస్తే..
👉రెండో పౌర్ణమి రోజున చంద్రుడిని బ్లూ మూన్ అని పిలుస్తారు. ఈ అక్టోబర్ నెలలోని ఒకటి, రెండు తేదీల్లో తొలి పౌర్ణమి వచ్చింది. నేడు ఇదే నెలలో రెండో పౌర్ణమి వస్తోంది..
👉అయితే సంపూర్ణ చందమామ... అత్యంత ఎక్కువ కాంతితో, పెద్ద పరిమాణంలో కనిపించబోతోంది..
👉October 1న కూడా ఇలాంటిది వచ్చింది. కానీ... దాని కంటే ఇదే ఎక్కువ కాంతితో కనిపించనుంది.
👉ఈసారి వచ్చే పెద్ద బ్లూ మూన్... ఎప్పుడో 76 ఏళ్ల కిందట రెండో ప్రపంచ యుద్ధ కాలంలో 1944లో వచ్చింది. మళ్లీ ఇప్పుడే హాలోవీన్ టైమ్‌లో వస్తోంది.
👉ఒక నెలలో సాధారణంగా ఒక పౌర్ణమి, అమావాస్య వస్తూ ఉంటాయని ముంబై నెహ్రూ ప్లానిటోరియం డైరెక్టర్ అరవింద్ పరంజ్‌పే తెలిపారు..
👉సుమారు 30 నెలల తర్వాత సంవత్సరంలో ఒక అదనపు పౌర్ణమి ఉంటుందని ఆయన చెప్పారు. ఇందుకు గల కారణాన్ని కూడా ఆయన వివరించారు..
👉చంద్రుని నెల వ్యవధి 29 రోజుల 12 గంటల 44 నిమిషాల 33 సెకండ్లు అని ఆయన తెలిపారు.
👉నెలలోని ఒకటి రెండు తేదీల్లో పౌర్ణమి సంభవించినప్పుడు మాత్రమే.... ఆ నెలలో రెండో పౌర్ణమి వచ్చే అవకాశం ఉంటుందన్నారు..
👉February విషయానికి వస్తే సాధారణ సంవత్సరంలో గానీ, లీప్ సంవత్సరంలో గానీ బ్లూ మూన్ ఏర్పడే అవకాశం లేదన్నారు.
👉30 రోజులు ఉండే నెలలో కూడా BlueMoon ఏర్పడే అవకాశం చాలా అరుదుగా వస్తుందన్నారు. 30 రోజులతో కూడిన నెలలో చివరి బ్లూ మూన్ June 30, 2007 న వచ్చిందని..
👉తదుపరి బ్లూ మూన్ సెప్టెంబర్ 30, 2050 ఉంటుందని పరంజ్‌పే చెప్పారు. 2018లో రెండు బ్లూ మూన్స్ కనిపించాయని, మొదటిది జనవరి 31న, రెండవది మార్చి 31న దర్శనమిచ్చాయని చెప్పారు.
👉ఆ ఏడాది February 28 రోజులు ఉండవల్ల అది సాధ్యమైందని చెప్పారు. ఇక, తదుపరి బ్లూ మూన్ 2023 ఆగస్టు 31న కనిపించనుందని తెలిపారు.
👉ఇక,, బ్లూ మూన్ పదానికి నీలం రంగుకు అసలు సంబంధం లేదు. ఎందుకంటే చంద్రుడు నీలిరంగులో కనిపించడం అరుదుగా జరుగుతోంది.
👉అది ఆకాశంలోని భూ వాతావరణం కలిగిన దుమ్ము,, ధూళి కణాల వల్ల సంభవిస్తుంది.
👉900 నానోమీటర్ల కంటే వెడల్పు కలిగిన ఈ కణాలు వాతావరణంలోని Red కలర్ కాంతి ని చెదరగొట్టగలిగినప్పుడు.. Moon నీలం రంగులో కనిపించే అవకాశం ఉంటుంది.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Social Plugin