LRS పై అపోహలొద్దు.. ఇది తెలుసుకోండి...
👉ఒకవైపు ఎల్ఆర్ఎస్... మరోవైపు ఆస్తుల నమోదు.... ఈ రెండు అంశాలూ ఏక కాలంలో జరుగుతుండడంతో కొన్ని విషయాలపై ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.
👉వివరాలు ఇలా ఉన్నాయి. పంచాయతీ లేదా మునిసిపాలిటీల్లో కొన్నేళ్ల క్రితం సుమారు 200 గజాల్లో భవన నిర్మాణానికి అనుమతి తీసుకున్నారు.
👉ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. భవన నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసినప్పుడు 15 శాతం జరిమానా విధించి అనుమతులు ఇచ్చినా వాటికి సైతం ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కావాలని అడుగుతున్నారంటూ పలువురు ఆంధ్రజ్యోతి దృష్టికి తీసుకువచ్చారు.
👉 దీనిపై అధికారులను, సబ్ రిజిస్ర్టార్లను ఆంధ్రజ్యోతి వివరణ కోరింది. ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి సంబంధిత శాఖల అధికారులు స్పష్టమైన వివరణ ఇచ్చారు.
💥ఎల్ఆర్ఎస్ ప్రస్తావనే లేదు💥
👉ఆస్తుల నమోదుకు సంబంధించిన దరఖాస్తు ఫారంలో ఎల్ఆర్ఎస్ కాలం లేదు.
👉ఆ విషయాన్ని ఎవరూ ప్రస్తావించడం లేదు. మనుషుల వివరాలను మాత్రమే తీసుకుంటున్నాం. ఇల్లుందా..? ప్రభుత్వం ఇచ్చిందా..? సొంత ఇల్లా..? డాక్యుమెంటా.. గిఫ్ట్ డీడా అని అడుగుతున్నారే తప్ప.. ఎల్ఆర్ఎస్ ప్రస్తావన అసలు లేదు.
- జి.వేణుగోపాల్ రెడ్డి, కమిషనర్, బండ్లగూడ జాగీర్ మునిసిపల్ కార్పొరేషన్
👉ఖాళీ స్థలాలకు మాత్రమే.
👉ఎల్ఆర్ఎస్ అనేది కేవలం ఖాళీ స్థలాలకు మాత్రమే. ఇప్పటికే నిర్మాణాలు చేపట్టి, ఇంటి నంబర్స్ ఉన్న వాటికి ఎల్ఆర్ఎస్ అవసరం లేదు.
👉ఒకవేళ ప్రభుత్వం బీఆర్ఎస్ తీసుకొస్తే అపార్టుమెంట్స్కు అవకాశం ఉంటుంది.
- జ్యోతి, సబ్ రిజిస్ర్టార్, సూరారం
Social Plugin