Hot Posts

6/recent/ticker-posts

IBPS: మొత్తం 9640 బ్యాంక్‌ ఉద్యోగాలు.



💥IBPS: మొత్తం 9640 బ్యాంక్‌ ఉద్యోగాలు.. ఈనెల 26 నుంచి దరఖాస్తులు పునఃప్రారంభం..!


👉బ్యాంక్‌ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం నిరాశతో ఎదురు చూస్తున్న నిరుద్యోగలకు ఐబీపీఎస్ వరాన్ని ప్రకటించింది. గ్రామీణ బ్యాంకుల్లో 9640 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ గడువు గతనెలతో ముగిసిన విషయం తెలిసిందే. 

👉అయితే.. అప్పుడు దరఖాస్తు చేసుకోని వాళ్ల కోసం ఐబీపీఎస్‌ మరో అవకాశం కల్పించింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల (అక్టోబర్‌) 26 నుంచి నవంబర్‌ 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉 అధికారిక ప్రకటన కోసం https://ibps.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.


👉దేశవాప్తంగా 43 గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్ల నియామకాలకు ప్రక్రియ పునః ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో 5 ఆర్ఆర్‌బీల్లో 836 పోస్టులు (ఏపీ 366, తెలంగాణ 470) ఉన్నాయి.


 💥మొత్తం ఖాళీలు: 9640


◆ ఆఫీస్ అసిస్టెంట్‌(మ‌ల్టీప‌ర్ప‌స్‌)- 4624

◆ ఆఫీస‌ర్‌(అసిస్టెంట్ మేనేజ‌ర్‌)- 3800

◆ అగ్ర‌క‌ల్చ‌ర్ ఆఫీస‌ర్‌- 100

◆ మార్కెటింగ్ ఆఫీస‌ర్‌- 08

◆ ట్రెజ‌రీ మేనేజ‌ర్‌- 03

◆ లా ఆఫీస‌ర్‌- 26

◆ చార్టెడ్ అకౌంటెంట్‌- 26

◆ ఐటీ ఆఫీస‌ర్‌- 58

◆ జ‌న‌ర‌ల్ బ్యాంకింగ్ ఆఫీస‌ర్‌- 837

◆ ఆఫీస‌ర్‌ (స్కేల్‌-3)- 156


 💥అర్హత : 

పోస్టులను బట్టి ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ, కొన్ని పోస్టులకు సీఏ ఉత్తీర్ణులై ఉండాలి.


 💥ఎంపిక విధానం:

👉రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. స్కేల్ - 1 ఆఫీసర్లకు రెండు దశల్లో రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి.

👉 స్కేల్ -2, 3 ఆఫీసర్లకు ఒక రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వాటిలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపికలు జరుగుతాయి.


💥దరఖాస్తు విధానం:

 👉ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


 💥దరఖాస్తు ఫీజు:

👉 ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు రూ.175, మిగిలిన వారికి రూ.850.


 💥దరఖాస్తులు ప్రారంభ తేదీ : అక్టోబర్‌ 26, 2020


 👉దరఖాస్తుకు చివరితేది:* నవంబర్‌ 9, 2020


 💥ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీలు:

 ఆఫీసర్‌ పోస్టులకు డిసెంబర్‌ 31, 2020.. ఆఫీసర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 2021, జనవరి 2, 4 తేదీల్లో జరుగుతాయి.


 💥వెబ్‌సైట్‌: CLICK HERE