👉వరద బాధితులకు ప్రభుత్వ ఉద్యోగుల చేయూతనిచ్చారు.
👉 ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
👉రూ.33 కోట్లను విరాళంగా అందిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌కు కాన్సెంట్ లెటర్ పంపారు.
👉అయితే డీఏ విషయంలో విధానం మార్చాలని అధికారులకు కేసీఆర్ ఆదేశించారు. ప్రతి 6 నెలలకు గడువుతేదీన రాష్ట్రంలో డీఏ నిర్ణయించాలని, కేంద్ర అంచనాలు అందిన తర్వాత అవసరమైతే సవరించాలని సూచించారు.
👉2019 జూలై 1 నుంచి రావాల్సిన ఒక డీఏను ఉద్యోగులకు చెల్లించాలని ఆదేశించారు. దసరా మరుసటి రోజైన 26వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని కేసీఆర్ సూచించారు.
👉భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న కుటుంబాలను ఆదుకుంటామని..
👉ముంపు ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
👉వర్షాల వల్ల ఇల్లు పూర్తిగా కూలిపోతే రూ.లక్ష, పాక్షికంగా దెబ్బతింటే రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు కేసీఆర్ తెలిపారు.
'👉'భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, వర్తక - వాణిజ్య- వ్యాపార ప్రముఖులు ముందుకు రావాలి. బాధితులకు చేయూతనివ్వాలి.
👉కష్టంలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ఉదారత చాటాలి. ముఖ్యమంత్రి సహాయనిధికి విరివిగా విరాళాలు ఇవ్వాలి'' అని కేసీఆర్ కోరారు.
Social Plugin