Hot Posts

6/recent/ticker-posts

పగటి దోమల వలన ఎంత ప్రమాదమో తెలుసా?

పగటి దోమల వలన ఎంత ప్రమాదమో తెలుసా?



👉కురిసిన వానలతో చాలా చోట్ల మురికిగుంతలు ఏర్పడ్డాయి. దీంతో దోమల విజృంభణ పెరుగుతోంది. ప్రధానంగా పగటి పూట కుట్టే దోమతో డెంగీ ముప్పు పొంచి ఉంటుంది. 


👉ఏటా ఈ సీజన్‌లో రోజూ ఒక్కో వైద్యుడి వద్దకు 30 వరకు డెంగీ కేసులు వస్తుండేవి. ఈ సారి తక్కువగానే నమోదయ్యాయి. 

👉రోజూ ముగ్గురు నుంచి అయిదుగురు మాత్రమే డెంగీ జ్వరంతో వస్తున్నట్లు ప్రైవేట్‌ ఆస్పత్రుల వైద్యులు పేర్కొంటున్నారు.

👉ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ నిల్వ నీటితో పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

👉పగటి దోమతోనే తంటా...


👉డెంగీ దోమ పగటి పూటే జనంపై దాడి చేస్తుంది. ఇది ఎయిర్‌ కూలర్‌, ఫ్లవర్‌ వాజులు, అక్వేరియం ఇతరత్రా నీరు నిల్వ ఉండే ప్రాంతాలలో నివాసం ఉంటుంది.

👉సూర్యోదయం నుంచి అస్తమయం వరకు అర్బన్‌ మస్కిటో కుట్టే అవకాశం ఉంటుంది. 


👉దీనికి మనిషి రక్తమే ఆహారం కావడంతో వారినే టార్గెట్‌ చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. డెంగీ రోగిని కుట్టిన దోమ మరొకరిని కుడితే వారికి కూడా డెంగీ వస్తుందని వైద్యులు తెలిపారు.


👉ఈ దోమతో జబ్బులు ఇలా...


💥క్లాసిక్‌ డెంగీ ఫీవర్‌ :

 👉ఇది ప్రమాదకరం కాదు. వైరల్‌ ఫీవర్‌లో ఉండే లక్షణాల ఆధారంగా క్లాసిక్‌ డెంగీ ఫీవర్‌గా పరిగణిస్తారు. సహజంగా అయిదు నుంచి ఏడురోజుల్లో తగ్గిపోతుంది.


💥డెంగీ హెమరేజిక్‌ ఫీవర్‌ : 

👉ఈ దశలో రోగి రక్త నాళం నుంచి ప్లాస్మా బయటకు వెళ్లిపోతుంది. 

👉దీనిని ప్లాస్మా లీకేజీ సిండ్రోమ్‌ అని వైద్యులు వ్యవహరిస్తారు. 

👉ఈ దశలో రక్తంలో పరిమాణం తగ్గిపోవడం, బీపీ తగ్గిపోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. ప్లేట్‌లెట్‌ సంఖ్య కూడా తగ్గిపోతుంది. 

👉ఈ దశలో రోగిని ఇన్‌టెన్సివ్‌ కేర్‌లో ఉంచి చికిత్సలు అందిస్తారు.


💥డెంగీ షాక్‌ సిండ్రోమ్‌ : 

👉ఇది చాలా తీవ్ర దశ. ఈ దశలో నీరు ఊపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదముంది. 

👉రోగికి సాధారణ మందులతో పాటు ఫ్లూయిడ్‌ ఇచ్చి రక్తప్రసరణను పెంచాల్సిన ఆవశ్యకత ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.


💥ఇవి గుర్తుంచు కోవాలి..


👉పగలు దోమ కుట్టదనే భావనతో ఉండకూడదు.


👉శరీరం పూర్తిగా కవర్‌ అయ్యే విధంగా దుస్తులు ధరించాలి.


👉పగలు కూడా మస్కిటో రిపెల్లెంట్స్‌ వినియోగించాలి.


👉కిచెన్‌లో పడేసే అన్నం, కూరలు, చెత్తను ఓపెన్‌గా పెట్టొద్దు.


👉పండ్ల తొక్కలను ఇంటి పరిసర ప్రాంతాల్లో వేయరాదు.


👉ఫ్లవర్‌ వాజ్‌, ఎయిర్‌ కూలర్‌లలో నీళ్ళను నిత్యం మార్చాలి.


👉కాలనీ, ఇళ్లలో నీటి గుంతలను పూడ్చాలి.


👉విరిగిపోయిన ప్లాస్టిక్‌ బకెట్లు, పాత ట్యూబ్‌, టైర్లు ఇళ్లలో ఉంచొద్దు.


👉నీటి ట్యాంకులకు మూతలు పెట్టాలి.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏