💥CET-కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ :ఏమిటి పరీక్ష, ఎలా నిర్వహిస్తారు, కొత్తగా వచ్చే మార్పులు?
💥ప్రభుత్వ రంగ ఉద్యోగాలు అన్నిటికీ కలిపి ఇకపై ఉమ్మడి ప్రవేశ పరీక్ష (కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ - సీఏటీ) నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది.💥
👉ఈ పరీక్ష నిర్వహణకు జాతీయ నియామక సంస్థ (నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ)ను ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించింది.
👉ఈ ప్రక్రియ ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో మార్పు తీసుకొస్తుందని, పారదర్శకతను ప్రోత్సహిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఇది రైల్వే, బ్యాంకింగ్ ఉద్యోగాలకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహించే తొలి దశ ప్రవేశ పరీక్ష మాత్రమే.
👉ప్రస్తుతం వివిధ ప్రభుత్వ రంగ ఉద్యోగాలకు విడిగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులపై ఆర్థికభారం ఎక్కువగా ఉండడమేకాక, ఇతరత్రా ఇబ్బందులు కూడా వస్తున్నాయి.
👉 వీటన్నిటినీ తొలగించేందుకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష దోహదపడుతుందని ఆశిస్తున్నారు.
👉కేంద్ర మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు.
👉ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షతో అనేక పరీక్షలు తొలగిపోతాయి. దానివల్ల విలువైన సమయం, వనరులు ఆదా అవుతాయి.
👉ఎంపికలో పారదర్శకత కూడా పెరుగుతుంది" అని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు.
💥అసలు ఈ సీఏటీ ఏంటి?
👉భారతదేశంలో ప్రతి సంవత్సరం రెండు నుంచి మూడు కోట్ల మంది యువత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం, బ్యాంక్ ఉద్యోగాల కోసం వివిధ పోటీ పరీక్షల్లో పాల్గొంటారు.
👉వీటన్నిటికోసం విడిగా దరఖాస్తు పెట్టుకోవాలి. మూడు, నాలుగు వందలనుంచీ ఎనిమిది, తొమ్మిది వందలవరకూ ప్రవేశ పరీక్ష రుసుము చెల్లించాలి.
👉ఇప్పుడు జాతీయ నియామక సంస్థ ఆ పరీక్షలన్నిటినీ రద్దు చేసి ఒకే ఒక్క పరీక్ష నిర్వహించనున్నది.
👉ఎస్ఎస్‌సీ, ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్ మొదలైన వాటన్నిటికీ ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా తొలిదశ స్క్రీనింగ్ చేస్తారు.
👉ఈ పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది. పదవ తరగతి, ఇంటర్ (11+12), డిగ్రీ పాసయిన వాళ్లందరూ ఈ పరీక్షకు అర్హులే.
👉కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకోసం విద్యార్థులు వివిధ పరీక్షలకు వివిధ రకాలుగా ప్రిపేర్ అవ్వాల్సిన పని లేకుండా ఈ ఒక్క పరీక్ష మీద దృష్టి పెడితే చాలు.
💥ఈ పరీక్ష ఎలా నిర్వహిస్తారు?
👉ప్రతీ జిల్లాలోనూ రెండు పరీక్షా కేంద్రాలను నిర్వహిచనున్నారు. ఇది విద్యార్థులకు ప్రయాణ భారాన్ని తగ్గిస్తుందని కేంద్రం తెలిపింది.
👉ఇందులో వచ్చిన మార్కులు మూడేళ్లవరకూ చెల్లుతాయని, అంతేకాకుండా ఈ ప్రవేశ పరీక్షకు వయసు పరిమితి ఉండబోదని కేబినెట్ తెలిపింది.
💥ఈ కొత్త పరీక్షా విధానం వలన ఎలాంటి మార్పులొస్తాయి?
👉ఇది పరీక్షా విధానంలో ఎంతోకాలంగా వేచి చూస్తున్న సంస్కరణలు తీసుకు వస్తుందని విద్యారంగానికి చెందిన ప్రముఖులు భావిస్తున్నారు.
👉ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ పరీక్షా విధానం మంచిదేనని, విద్యా వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావాలు చూపిస్తుందని కెరీర్ కౌన్సిలర్ అనిల్ సేఠీ అభిప్రాయం వ్యక్తం చేసారు.
👉 అయితే ఇది సంస్కరణల దిశగా మొదటి అడుగు మాత్రమేనన్న సంగతి మర్చిపోకూడదని ఆయన అన్నారు.
👉"వివిధ పరీక్షలకు వివిధ పద్ధతుల్లో హాజరు కావలసి వస్తుంది. అనేక దరఖాస్తులు నింపాలి, దూరాలు ప్రయాణించాల్సి వస్తుంది.
👉 విద్యార్థులు కొంత ఇబ్బంది పడతారు. కానీ ఇప్పుడు అవన్నీ లేకుండా ఒకే ఒక్క పరీక్ష ఉండడం ఆహ్వానించదగ్గ విషయం. నన్నడిగితే ఈ పద్ధతి చాలా యేళ్ల క్రితమే వచ్చి ఉండాల్సింది."
👉"ప్రస్తుతం ఎస్ఎస్సీ పరీక్ష రాస్తే ఎస్ఎస్సీ ఉద్యోగానికి మాత్రమే అర్హులు. అలాగే ఆర్ఆర్బీ రాస్తే రైల్వే ఉద్యోగాలకు మాత్రమే అర్హత సంపాదిస్తారు.
👉ఈ పరీక్షల స్కోరు మూడేళ్లు చెల్లుతుంది కాబట్టి ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష రాస్తే ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, బ్యాంక్ ఉద్యోగాలు..వేటికైనా సరే తొలిదశ అర్హత సంపాదించొచ్చు.
👉నా ఉద్దేశంలో ఇది చాలా మంచి పరిణామం".
💥ఈ పరీక్ష గురించి యువత ఏం అనుకుంటున్నారు?
👉ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆశిస్తున్న పేద విద్యార్థులందరికీ లాభదాయకంగా ఉంటుంది.
👉"ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షా విధానం ఆశావహంగా ఉంది.
👉ప్రస్తుత విధానంలో ఒక ఏడాది ఏ కారణాలవల్లైనా పరీక్ష రాయలేకపోతే, ఇంక ఆ సంవత్సరం వృధా అయిపోయినట్టే.
👉 కానీ సీఈటీ ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తామని అంటున్నారు."
👉"ప్రస్తుతం ప్రతీ పరీక్షకు వేరువేరుగా దరఖాస్తులు పెట్టుకోవాలి.
👉 IBPS లాంటి పరీక్షలకు జనరల్ క్యాటగిరీ దరఖాస్తు ఖరీదు 800 రూపాయలు ఉంటుంది.
👉 పేద విద్యార్థులకు ఇది కష్టమే. ఈ కొత్త విధానంలో కనీసం తొలిదశ పరీక్ష ఉచితంగ నిర్వహిస్తామంటున్నారు. ఇది మంచి విషయం. ఆ మేరకు ఆర్థికభారం, సమయభారం తగ్గుతాయి."
👉"ఎంతోమంది విద్యార్థులు ప్రభుత్వ రంగ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. ఈ ఉమ్మడి పరీక్షా విధానం వార్త వచ్చినదగ్గరనుంచీ ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పరీక్ష 2020 లో నిర్వహిస్తారా? ఒకవేళ 2021లో నిర్వహిస్తే అది 2020 సంవత్సర పరీక్షా?
👉 ఈ అంశంలో మరిన్ని వివరాలకోసం ఎదురుచూస్తున్నాం"
Social Plugin