💥ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన-PMJDY పథకానికి సరిగ్గా ఆరేళ్లు పూర్తైంది.
👉 2014 ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జన్ ధన్ యోజన పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.
👉అదే ఏడాది ఆగస్ట్ 28న ఈ పథకాన్ని ప్రారంభించారు. పౌరులందరికీ బ్యాంకు అకౌంట్ ఉండాలని, ప్రతీ కుటుంబంలో కనీసం ఒక బ్యాంకు అకౌంట్ అయినా ఉండాలన్న లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఇది.
👉విజయవంతంగా 6 ఏళ్లు పూర్తి చేసుకుంది. మొదటి ఏడాదిలోనే 17.90 కోట్ల అకౌంట్లు ఓపెన్ కావడం విశేషం. ఇక ఇప్పటి వరకు 40.35 కోట్ల మంది ఈ పథకంలో చేరారు. వాటిలో 34.81 కోట్ల అకౌంట్‌లు యాక్టీవ్‌గా ఉన్నాయి. మొత్తం అకౌంట్లలో 63.6% గ్రామీణ ప్రాంతం నుంచే కావడం విశేషం.
👉ఇక 55.2% జన్ ధన్ అకౌంట్లు మహిళల పేర్లతో ఉన్నాయి.
👉జన్ ధన్ ఖాతాల్లో డిపాజిట్లు రూ.1.31 లక్షల కోట్లకు పెరిగింది. ఒక అకౌంట్‌కు యావరేజ్ డిపాజిట్ రూ.3239. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మహిళల జన్ ధన్ అకౌంట్లలోకి 2020 ఏప్రిల్ నుంచి జూన్ మధ్య రూ.30,705 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేయడం విశేషం.
👉ఇదే కాదు పీఎం కిసాన్, ఉపాధి హామీ, హెల్త్ ఇన్స్యూరెన్స్ కవర్, ఎల్‌పీజీ సబ్సిడీ లాంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రత్యక్ష నగదు బదిలీ ఈ అకౌంట్లలోనే జమ అవుతుంది.
👉జన్ ధన్ అకౌంట్ 20 ఏళ్ల నుంచి 65 ఏళ్ల లోపు వారు తీసుకోవచ్చు.
👉జన్ ధన్ అకౌంట్‌లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు.
👉ఈ అకౌంట్ మెయింటైన్ చేయడానికి ఎలాంటి ఛార్జీలు ఉండవు.
👉అకౌంట్ తీసుకున్నవారికి ఉచితంగా రూపే డెబిట్ కార్డ్.
👉అకౌంట్ హోల్డర్‌కు ఉచితంగా రూ.2 లక్షల యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ కవరేజీ.
👉జన్ ధన్ అకౌంట్‌పై రూ.10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ.
👉ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ 60 నుంచి 65 ఏళ్లకు పెంపు.
👉2014 ఆగస్ట్ 15 నుంచి 2015 జనవరి 31 మధ్య అకౌంట్ ఓపెన్ చేసిన వారికి రూ.1,00,000 యాక్సిడెంట్ కవర్, రూ.30,000 లైఫ్ కవర్.
Social Plugin