Hot Posts

6/recent/ticker-posts

Central Guidelines for Online classes

కరోనా మహమ్మారి వల్ల విద్యావ్యవస్థ అస్తవ్యస్తమైంది.
4 నెలలుగా స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. మళ్లీ ఎప్పుడు తెరచుకుంటాయో తెలియదు. ఐతే ప్రైవేట్ స్కూళ్లు మాత్రం ఆన్‌లైన్ క్లాసులను నిర్వహిస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలకు కూడా కంప్యూటర్, స్మార్ట్ ఫోన్లలో పాఠాలు చెబుతున్నారు. దీనిపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ క్లాసులను నిషేధించాలని కోర్టుల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరుతుండగానే.. ఆన్‌లైన్ తరగతులకు సంబంధించి కేంద్రం స్పష్టత ఇచ్చింది. మంగళవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆన్‌లైన్ తరగతులకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది.

విద్యార్థులకు గంటల తరబడి ఆన్‌లైన్ క్లాసులు బోధించకుండా స్క్రీన్ టైమ్ కుందించాలి.

ప్రీ ప్రైమరీ విద్యార్థులకు రోజులో 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఆన్‌లైన్ బోధన ఉండరాదు

1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు 45 నిమిషాలకు మించకుండా రోజుకు రెండు సెషన్‌లు నిర్వహించవచ్చు.

9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు 45 నిమిషాలకు మించకుండా చొప్పున నాలుగు సెషన్‌లు నిర్వహించవచ్చు.

విద్య ప్రమాణాలను పెంచడానికి, ఆన్‌లైన్ విద్యను ప్రోత్సహించడానికి ఈ మార్గదర్శకాలు తోడ్పడుతాయని హెచ్‌ఆర్‌డీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అభిప్రాయపడ్డారు.

విద్య నాణ్యతను పెంచడానికి, ఆన్‌లైన్ విద్యను ముందుకు తీసుకెళ్లడానికి మార్గదర్శకాలు తోడ్పడుతాయని మార్గదర్శకాల విడుదల సందర్భంగా హెచ్‌ఆర్‌డీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ చెప్పారు. పాఠశాలల బాధ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సహా అందరికీ ఈ మార్గదర్శకాలు ఉపయోగకరంగా ఉంటాయని పోఖ్రియాల్ పేర్కొన్నారు.


PRAGYATHA Guidelines PDF :-Click Here