🎯 What is Hydra, FTL?
బఫ్ఫార్ జోన్, FTL అంటే ఏంటి... హైడ్రా అంటే ఏమిటి? అక్కడ ఎందుకు కట్టడాలు కూలుస్తున్నారు.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని చెరువులు, నాలాలపై అక్రమంగా నిర్మించిన భవనాలు,కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. చెరువులను ఆక్రమించి కట్టిన బిల్డింగులపై హైడ్రా దృష్టిపెట్టింది.
ఈ నేపథ్యంలో బఫర్ జోన్, ఫ్టల్, హైడ్రా అనే పదాలు తరుచూ వార్తల్లో వినిపించడం తో పాటుగా కనిపిస్తున్నాయి. ఇంతకీ బఫర్ జోన్ మరియు FTL అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!
👉ఎఫ్‌టీఎల్(FTL) అంటే...
ఎఫ్‌టీఎల్ అనగా ఫుల్ ట్యాంక్ లెవల్. ప్రతి చెరువుకు నీరు నిల్వ ఉండే ప్రాంతం లేదా నీరు విస్తరించే ప్రాంతాన్ని అంచనా వేసి ఫుల్ ట్యాంక్ లెవల్ నిర్ణయిస్తారు. వర్షాకాలంలో చెరువులో పూర్తిగా నీళ్లు ఉంటే ఏ ఏరియా వరకు నీరు నిల్వ ఉంటుందో ఎఫ్‌టీఎల్ తెలియజేస్తుంది.
👉బఫర్ జోన్.
రెండూ లేదా అంతకంటే ఎక్కువ నీటి వనరులు ఉన్న ప్రాంతాలను వేరు చేసే ప్రదేశాన్ని బఫర్ జోన్ అంటారు. చెరువు లేదా ఏదైనా నీటి వనరు యెక్క పరిధిని బట్టి కొంత దూరం వరకు బఫర్ జోన్ ఉంటంది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎఫ్‌టీఎల్ మరియు బఫర్ జోన్‌లో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. బఫర్ జోన్ యెక్క పరిధి నీటి వనరు యెక్క ప్రాంతాన్ని బట్టిఉంటుంది. బఫర్ జోన్ పరిధిలో సొంత భూమి ఉన్నా సరే అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఆ భూమిలో కేవలం సాగు మాత్రమే చేసుకోవచ్చు.
👉అసలేంటీ... హైడ్రా ?
హైడ్రా యెక్క పూర్తిపేరు -హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ.
హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జాకు గురికాకూడదనే ప్రధాన లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు హైడ్రా ఏర్పాటైంది.
హైడ్రా పరిధి ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) వరకు విస్తరించి ఉంటుంది.
హైడ్రా కు ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయటం, ఆక్రమణలను తొలిగించటం, అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకుంటుంది.
Social Plugin