అద్భుతమైన సంఖ్య - 3816547290
👉పై సంఖ్య ఒక అద్భతమైన సంఖ్య. ఈ సంఖ్యలో 10 అంకెలు గలవు, ఈ సంఖ్యలో 0 నుండి 9 వరకు అన్ని అంకెలు ఉన్నాయి. ఈ సంఖ్య సరిసంఖ్య అవుతుంది.
👉పై సంఖ్యను పరిశీలిస్తే బేసి సంఖ్యతో ప్రారంభమై, సరిసంఖ్యతో ముగిసినది. మొదటి బేసి సంఖ్య, తరువాత సరిసంఖ్య, మరల బేసిసంఖ్య, తరువాత సరిసంఖ్య.. అలా వరుస క్రమంలో ఉన్నాయి. సంఖ్యలోని అంకెల మొత్తం బేసిసంఖ్య అవుతుంది.
1+2+3+4+5+6+7+8+9+0=45.
👉పై సంఖ్యలోని అంకెల మొత్తం 45 యొక్క అంకమూలం మరల బేసి సంఖ్య (4+5=9) అవుతుంది.
👉ఈ సంఖ్య మరో ముఖ్యమైన ప్రత్యేకత కల్గి ఉంది, అది ఏమిటంటే ఎడమ వైపు నుంచి సంఖ్యల ఏర్పాటు చూస్తే ఒక అంకె గల సంఖ్య ఒకటితో (3/1,) రెండు అంకెల సంఖ్య రెండుతో (38/2) , మూడు అంకెల సంఖ్య మూడుతో (381/3) , నాలుగు అంకెల సంఖ్య నాలుగుతో (3816/4) , ఐదు అంకెల సంఖ్య, ఐదుతో (38165/5) , ఆరు అంకెల సంఖ్య ఆరుతో (381654/6) , ఏడు అంకెల సంఖ్య ఏడుతో (3816547/7) , ఎనిమిది అంకెల సంఖ్య ఎనిమిదితో (38165472/8) , తొమ్మిది అంకెల సంఖ్య తొమ్మిదితో (381654729/9) , పది అంకెల సంఖ్య పదితో (3816547290/10) నిశ్శేషంగా భాగింప బడుతుంది...
Social Plugin