టెన్త్ పరీక్షలు రద్దు..!
ఇంటర్ ఎగ్జామ్స్ వాయిదా..!
*కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో జరగాల్సిన పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే (సీబీఎస్ఈ) పదోతరగతి పరీక్షలను రద్దు చేయగా, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.*
👉To Join WHAT’S UP GROUP:-https://chat.whatsapp.com/F5U3vVJuCemED3Xzfruk2K
👉TO JOIN OUR TELEGRAM GROUP:-https://t.me/jbkrishnacreative
👉To subscribe our youtube channel:-http://www.youtube.com/c/JBkrishna
*ఈ నేపథ్యంలోనే అకాడమిక్ ఇయర్ పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు.
కరోనా సెకండ్ వేవ్ తీవ్రతను, పేరెంట్స్ ఆందోళనలను దృష్టి పెట్టుకుని పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
పదవ తరగతి పరీక్షలు రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే సీబీఎస్ఈ పరీక్షలు రద్దయ్యాయి. ఇదే తరుణంలో రాష్ట్రంలో కూడా పరీక్షలను రద్దు చేసేందుకే ప్రభుత్వం మొగ్గు చూపింది.
ఇక ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ విషయానికి సంబంధించిన ఫైల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విద్యాశాఖ మంత్రి పంపించారు.
ఈ ఫైల్‌పై ముఖ్యమంత్రి సంతకం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో 5 లక్షల 35 వేల మంది టెన్త్ విద్యార్థులు ఉన్నారు.
కాగా, వీరందరినీ పైతరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు 4 లక్షల 58 వేల మంది ఉన్నారు. కరోనా ఉధృతి తగ్గాక వీరికి పరీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా ఇది వరకే ప్రకటించిన ప్రవేశ పరీక్షల తేదీలు పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
అయితే, ఇంటర్ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులను ఈనెల 30 వరకు పొడగించడంతో పాటు పరీక్ష తేదీలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
దీనికి సంబంధించి మరికాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది.
Social Plugin