Hot Posts

6/recent/ticker-posts

కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్- 24.02.2021

 🔥కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్- 24.02.2021🔥




1. నార్త్ ఈస్ట్రన్ కౌన్సిల్ (ఎన్ఇసి) 69వ ప్లీనరీ సమావేశం  2021 జనవరి 23 నుండి మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో రెండు రోజుల పాటు జరిగింది. అయితే ఎన్ ఇసికి చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు.

1. ప్రధానమంత్రి

2. కేంద్ర హోం మంత్రి

3. కేంద్ర రక్షణ మంత్రి

4. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి

సమాధానం: 2


వివరణ:  నార్త్ ఈస్ట్రన్ కౌన్సిల్(ఎన్ఇసి)ని 1971లో పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర అనే 8 రాష్ట్రాలతో కూడిన భారతదేశంలోని ఈశాన్య ప్రాంత ఆర్థిక, సామాజికాభివృద్ధికి నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. దీనికి కేంద్ర హోం మంత్రి అధ్యక్షునిగాను, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి వైస్ చైర్మన్ గాను ఉంటారు. 2021 జనవరి 23 నుండి రెండు రోజుల పాటు మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో జరిగిన ఎన్ఇసి 69వ ప్లీనరీ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు.


2. 2021 జనవరి 20 నుండి 24 వరకు ఐదు రోజుల పాటు రాజస్థాన్ లోని జోధ్ పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో జరిగిన ‘ఎక్సర్ సైజ్ డిసర్ట్ నైట్ – 21(Exercise Desert Knight-21(Ex DK-21)’ వైమానిక దళ విన్యాసాలలో ఈ దేశాల వైమానిక దళాలు పాల్గొన్నాయి.

ఎ. భారత్

బి. ఫ్రాన్స్

సి. రష్యా

డి. ఇజ్రాయెల్

1. ఎ మరియు సి

2. ఎ మరియు బి

3. ఎ మరియు డి

4. ఎ, బి, సి

సమాధానం: 2


వివరణ: రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో 2021 జనవరి 20 నుండి 24 వరకు ఐదు రోజుల పాటు జరిగిన ఎక్సర్ సైజ్ డిసర్ట్ నైట్ -21 ద్వైపాక్షిక వైమానిక దళ విన్యాసాలలో భారత వైమానిక దళం(ఐఎఎఫ్), ఫ్రెంచ్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ (ఎఫ్ఎఎస్ఎఫ్) పాల్గొన్నాయి. ఇరు దేశాల వైమానిక దళాల ద్వైపాక్షిక విన్యాసాలలో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఈ విన్యాసాలలో రెండు దేశాల వైమానిక దళాల నుండి రఫేల్ ఫైటర్ జెట్స్ పాల్గొనడం విశేషం. ఎక్సర్ సైజ్ స్కైరోస్(SKYROS) అనే కోడ్ నేమ్ తో భారత్ మరియు ఫ్రాన్స్ లు జనవరిలో జోధ్ పూర్ యుద్ధ క్రీడలను కూడా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. స్కైరోస్ యుద్ధ క్రీడలో ఇరు దేశాలకు తరఫున రఫేల్ ఫైటర్ జెట్స్ పాల్గొన్నాయి. భారత వైమానిక దళం పాల్గొంటున్న మొట్టమొదటి వైమానిక దళ యుద్ధ క్రీడ స్కైరోస్


3. భారత నావికా దళం ఇటీవల త్రివిధ దళాల ఉమ్మడి సైనిక విన్యాసాలు AMPHEX-21 ను ఎక్కడ నిర్వహించింది?

1. అండమాన్ మరియు నికోబార్ దీవులు

2. జోధ్ పూర్, రాజస్థాన్

3. విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్

4. కొచ్చి, కేరళ

సమాధానం: 1


వివరణ: భారత నావికా దళం 2021 జనవరి 21 నుండి 25వ తేదీ వరకు ఐదు రోజుల పాటు అండమాన్ మరియు నికోబార్ దీవులలో త్రివిధ దళాల ఉమ్మడి యాంఫిబియస్ మిలటరీ ఎక్సర్ సైజ్ ‘Amphibious Military Exercise (AMPHEX-21) ’ను నిర్వహించింది. ఈ విన్యాసాలలో భాగంగానే అండమాన్ మరియు నికోబార్ దీవుల రక్షణ కోసం ‘కవచ్’ అనే రక్షణ విన్యాసాలను కూడా నిర్వహించింది. కవచ్ ను భారతదేశపు ఏకైక ఉమ్మడి దళాల కమాండ్ అయిన అండమాన్ మరియు నికోబార్ కమాండ్ (ఎఎన్ సి) క్రింద అండమాన్ సముద్రం మరియు బంగాళాఖాతంలో నిర్వహించడం జరిగింది. ఈ రెండు విన్యాసాలలో భారత సైన్యం, భారత వైమానిక దళం, భారత నావికా దళం మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్ లు పాల్గొన్నాయి. 


4. కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2021 జనవరి 23న అస్సాంలోని గువాహటిలో ప్రారంభించిన ‘ఆయుష్మాన్ సిఎపిఎఫ్’ కు సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది?

ఎ. ఇది సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీసు ఫోరెస్స్ (సిఎపిఎఫ్) సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు వర్తిస్తుంది

బి. దీనిని సిఎపిఎఫ్ తో పాటు అస్సాం రైఫిల్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ ఎస్ జి) సిబ్బందికి, వారి కుటుంబాలకు కూడా వర్తింపజేస్తారు

సి. 2021 మే 1 నుండి పూర్తిగా అమల్లోకి వచ్చే ఈ పథకాన్ని ‘ఆయుష్మాన్ భారత్ : ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన(ఎబి పిఎం – జెఎవై)’ క్రింద అమలు చేస్తారు

కోడ్స్

1. ఎ మాత్రమే

2. ఎ మరియు సి మాత్రమే

3. ఎ, బి మరియు సి

4. సి మాత్రమే

సమాధానం: 3


వివరణ: 2021 జనవరి 23న అస్సాంలోని గువాహటిలో ఒక కార్యక్రమానికి హాజరైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘ఆయుష్మాన్ సిఎపిఎఫ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది కేంద్ర సాయుధ పోలీసు దళాల(సిఎపిఎఫ్)తో పాటు అస్సాం రైఫిల్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ ఎస్ జి) సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు వర్తిస్తుంది. ఈ పథకాన్ని 2021 మే 1 నుండి దేశ వ్యాప్తంగా పూర్తిగా అమలు చేస్తారు. ఈ మేరకు జాతీయ ఆరోగ్య అథారిటీ(ఎన్ఎహెచ్) మరియు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంహెచ్ఎ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. సిఎపిఎఫ్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడం కోసం హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని సిఎపిఎఫ్, ఆయుష్మాన్ భారత్, జాతీయ ఆరోగ్య అథారిటీల కలయికతో ఇటువంటి పథకాన్ని దేశంలో అమలు చేయడం ఇదే మొదటిసారి. ఈ పథకం ద్వారా సిఎపిఎఫ్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు 24,000 ఆస్పత్రులలో ఉచితంగా చికిత్స పొందవచ్చు




5. 2021 జనవరి 16 నుండి 24 వరకు గోవాలో జరిగిన 51వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది?

ఎ. ఈ ఉత్సవాలను పనాజీలోని డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు

బి. కోవిడ్ – 19 కారణంగా దీనిని హైబ్రిడ్ మోడ్ లో అనగా, వివిధ కేటగిరీల క్రింద వచ్చిన 224 చలన చిత్రాలకు గాను 50 చలన చిత్రాలను మొట్టమొదటి సారిగా ఆన్ లైన్ లో ప్రదర్శించారు. 

సి. డ్యానిష్ చలన చిత్రం ఇంట్ ద డార్క్ నెస్ బంగారు నెమలి అవార్డును గెలుచుకుంది

కోడ్స్

1. ఎ మరియు బి మాత్రమే

2. బి మరియు సి మాత్రమే

3. బి మరియు సి మాత్రమే

4. పైవన్నీ

సమాధానం: 4


వివరణ: 51వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ)ను 2021 జనవరి 16 నుండి 24 వరకు గోవా రాజధాని పనాజీలోని డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. మొట్టమొదటి సారిగా ఈ ఉత్సవాలను హైబ్రిడ్ మోడ్ లో నిర్వహించారు. అన్ని కేటగిరీల నుండి మొత్తం 224 చలనచిత్రాలను ప్రదర్శించగా, 50 చిత్రాలను ఆన్ లైన్ లో ప్రదర్శించడం జరిగింది. ఈ విధంగా చేయడం భారతదేశంలోనే కాకుండా ఆసియాలో కూడా ఇదే మొదటిసారి. రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందించబడిన డ్యానిష్ భాషా చిత్రం ఇన్ టు ద డార్క్ నెస్(Into the Darkness) బంగారు నెమలి అవార్డును గెలుచుకుంది. సీనియర్ నటుడు, డైరెక్టర్, నిర్మాత బిశ్వజిత్ ఛటర్జీ కు ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. 50వ విముక్తి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న బంగ్లాదేశ్ ఈ సంవత్సరం ’కంట్రీ ఆఫ్ ద ఫోకస్ సెక్షన్’ క్రింద ఎంపిక చేసి, ఈ కేటగిరీలో ఆ దేశానికి సంబంధించిన 4 చలన చిత్రాలను ప్రదర్శించడం జరిగింది.


6. భారతదేశంలో 1,115 ఆనకట్టలు(డ్యామ్ లు) 50 సంవత్సరాలకు పైబడి వయసు కలిగి ఉన్నాయని, వాటి వల్ల ముప్పు ఉందని ‘Ageing Water Storage Infrastructure: An Emerging Global Risk ’ నివేదిక హెచ్చరించింది. అయితే ఈ నివేదికను విడుదల చేసిన సంస్థ

1. ప్రపంచ బ్యాంకు

2. యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ – ఇనిస్టిట్యూట్ ఫర్ వాటర్, ఎన్విరాన్ మెంట్ అండ్ హెల్త్

3. వరల్డ్ ఎకనామిక్ ఫోరం

4. డబ్ల్యుటిఓ

సమాధానం: 2


వివరణ : కెనడాలోని హమిల్టన్ లోని యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ – ఇనిస్టిట్యూట్ ఫర్ వాటర్ ఎన్విరాన్ మెంట్ అండ్ హెల్త్ (యుఎన్ యు- ఐఎన్ డబ్ల్యుఇహెచ్) ఇటీవల Ageing Water Storage Infrastructure: An Emerging Global Risk  నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం వయసు పైబడిన ఆనకట్టలు మానవ భద్రత మరియు పర్యావరణానికి ముప్పుగా మారనున్నాయి. ఈ భారీ డ్యామ్ లు ప్రపంచ సమస్యగా మారుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10,000 ఆనకట్టలు 50 సంవత్సరాల హెచ్చరిక వయసు పరిమితిని దాటాయి. కొన్ని డ్యామ్ లు త్వరలో 100 సంవత్సరాల వయసును సమీపిస్తున్నాయి. భారతదేశంలో 2025 నాటికి 1,115 భారీ ఆనకట్టలు 50 సంవత్సరాల మార్కును చేరుకుంటాయి. భారతదేశంలో ప్రస్తుత ఆనకట్టల నిర్మాణ రేటు ప్రపంచంలోనే అత్యంత అధికంగా ఉన్న వాటిలో ఒకటిగా ఉంది. కేరళలోని పెరియార్ నదిపై 1895లో నిర్మించిన ముల్లపెరియార్ డ్యామ్ గురించి ఈ నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ డ్యామ్ భూకంప ముప్పు ఉన్న ప్రాంతంలో ఉండటమే కాకుండా కూలిపోయే ముప్పు ఉందని, ఈ డ్యామ్ కుప్పకూలితో 35 లక్షల మంది ప్రజలపై ప్రభావం ఉంటుందని తెలిపింది. ప్రపంచంలోని భారీ డ్యామ్ లలో 32,716 (ప్రపంచం మొత్తం డ్యామ్ లలో 55%) కేవలం నాలుగు ఆసియా దేశాలు – చైనా, భారత్, జపాన్ మరియు దక్షిణ కొరియాలలోనే ఉన్నాయి. 



7. విద్యుత్ రంగంలో భారత్, బంగ్లాదేశ్ల సహకారంపై జాయింట్ స్టీరింగ్ కమిటీ(జెఎస్ సి) సమావేశం 2021 జనవరి 23న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగింది. ఈ సందర్భంగా 1320 మెగావాట్ల మైత్రీ సూపర్ థర్మల్ ప్రాజెక్టు గురించి చర్చ జరిగింది. అయితే ఈ ప్రాజెక్టును ఎక్కడ నిర్మిస్తున్నారు?

1. బంగ్లాదేశ్ లోని రాంఫాల్

2. త్రిపురలోని అగర్తల

3. మణిపూర్ లోని ఇంపాల్

4. బంగ్లాదేశ్ లోని పటౌకలి

సమాధానం: 1


వివరణ: 1320 మెగావాట్ల మైత్రీ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టును బంగ్లాదేశ్ లోని రాంఫాల్ లో నిర్మిస్తున్నారు. దీనిని భారతదేవ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్ టిపిసి) మరియు బంగ్లాదేశ్ పవర్ డెవలప్ మెంట్ బోర్డ్ (బిపిడిబి)ల మధ్య 50 – 50 జాయింట్ వెంచర్ అయిన బంగ్లాదేశ్ ఇండియా ఫ్రెండ్ షిప్ పవర్ కంపెనీ(బిఐఎఫ్ సిఎల్) నిర్మిస్తోంది. 2017లో నిర్మాణం ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 2022 నాటికి పూర్తి కానుంది. ఈ ప్రాజెక్టు ప్రపంచ వారసత్వ స్థలంగా ప్రకటించబడిన సుందర్ బన్స్ మడ అడవులకు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. 


8. 2021 సంవత్సరానికి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ ను అందుకున్న వారు

1. డాక్టర్ రాజేంద్ర కుమార్ భండారి

2. సస్టెయినబుల్ ఎన్విరాన్ మెంట్ అండ్ ఎకలాజికల్ డెవలప్ మెంట్ సొసైటీ (సీడ్స్)

3. 1 మరియు 2

4. ఎవరూ కాదు

సమాధానం: 3


వివరణ: సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ అవార్డును 2019 నుండి జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్ డిఎంఎ) అందిస్తోంది. విపత్తు నిర్వహణలో విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు రెండు కేటగిరీలలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు.  ఈ అవార్డును ప్రతి సంవత్సరం జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి రోజున ప్రకటిస్తారు. 2021 సంవత్సరానికి గాను వ్యక్తుల కేటగిరీలో డాక్టర్ రాజేంద్ర కుమార్ భండారి, సంస్థల కేటగిరీలో సస్టెయినబుల్ ఎన్విరాన్ మెంట్ అండ్ ఎకలాజికల్ డెవలప్ మెంట్ సొసైటీ( ఎస్ఇఇడిఎస్)కు ఈ అవార్డును ప్రకటించారు. ఈ అవార్డు క్రింద వ్యక్తులకు రూ. 5 లక్షలు, సంస్థలకు రూ. 51 లక్షలు నగదు అందిస్తారు. దీనితో పాటు సర్టిఫికెట్ కూడా అందజేస్తారు. 




9. 2021 జనవరి 22న విడుదల చేసిన బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం  2020-21 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికం(అక్టోబర్ – డిసెంబర్) లో ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ స్థానం క్రితంలో ఉన్న 13 నుండి ఎన్నవ స్థానానికి ఎగబాకారు?

1. 9

2. 10

3. 11

4. 12

సమాధానం: 3


వివరణ: 2020-21 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికం(అక్టోబర్ – డిసెంబర్ ) కాలంలో మొత్తం 79.2 బిలియన్ డాలర్ల(రూ.5.78 లక్షల కోట్ల) నికర విలువతో ముఖేష్ అంబానీ స్థానం 13 నుండి 11కు పెరిగింది. రియలన్స్ ఇండస్ట్రీస్ లాభం ఈ కాలంలో 12.5% పెరిగి రూ. 131 బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో ఆయన ర్యాంకు మెరుగుపడింది. ఆయన ఒరాకిల్ కార్పొరేషన్ లారీ ఎలిసన్ మరియు ప్రపంచలో అత్యంత సంపన్నురాలైన మహిళ ఫ్రాంకోయిస్ బెటన్ కోర్ట్ మేయర్స్ లను వెనక్కు నెట్టారు. బ్లూమ్ బర్గ్ బిలయనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో టాప్ 5 బిలియనీర్లు

1. ఎలన్ ఆర్ మస్క్ 202 బిలియన్ డాలర్లు

2. జెఫ్ బెజోస్ 192 బిలియన్ డాలర్లు

3. బిల్ గేట్స్ 133 బిలియన్ డాలర్లు

4. బెర్నార్డ్ అర్నాల్ట్ 112 బిలియన్ డాలర్లు

5. మార్క్ జూకర్ బర్గ్ 104 బిలియన్ డాలర్లు


10. 2021 జనవరి 24న ఒకే సారి 143 శాటిలైట్లను ఆవిష్కరించడం ద్వారా సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించిన సంస్థ?

1. బ్లూ ఆర్జిన్

2. స్పేస్ ఎక్స్

3. ఇస్రో

4. నాసా

సమాధానం: 2


వివరణ: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న కేప్ కానావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుండి 2021 జనవరి 24న స్పేస్ ఎక్స్ సంస్థ ఫాల్కన్ 9 రీ యూజబుల్ రాకెట్స్ ద్వారా ఒకే సారి సింగిల్ మిషన్ లో 143 శాటిలైట్లను ఆవిష్కరించడం ద్వారా సరికొత్త ప్రపంచ రికార్డును స్థాపించింది. 2017 ఫిబ్రవరిలో ఇస్రో స్థాపించిన 104 శాటిలైట్ల రికార్డును అధిగమించింది. శాటిలైట్లను ఆవిష్కరించడం ద్వారా స్పేస్ ఎక్స్ 2021 నాటికి గ్లోబల్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ ను అందించడానికి ప్రయత్నిస్తోంది. 143 శాటిలైట్లలో 133 వాణిజ్య మరియు ప్రభుత్వ క్యూబ్ శాట్ లు, మైక్రో శాట్ లు కాగా 10 స్టార్ లింక్ శాటిలైట్లు.