Hot Posts

6/recent/ticker-posts

కేంద్ర బడ్జెట్ 2021 ముఖ్యంశాలు.

 

కేంద్ర బడ్జెట్ 2021 ముఖ్యంశాలు

 

🔥 కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరానికిగానూ 34,83,236 కోట్ల బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. 

 కేంద్రం ఈసారి ప్రవేశపెట్టిన ఆర్థిక పద్దు పై కోవిడ్ ప్రభావం బాగానే కనిపించింది.
అత్యంత కీలక అంశాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
 
ప్రజారోగ్యం మినహా సంక్షేమ పథకాలకు ఇలాంటి కేటాయింపు జరగలేదు.

ఉద్యోగులు పన్ను చెల్లింపుదారుల పై ప్రత్యేక వరాల జల్లు కురిపించ లేదు.

కొవిడ్ ప్రభావంతో రాబడి తగ్గి  రెవిన్యూ లోటు పెరిగింది.
ప్రజారోగ్యం అదేవిధంగా కొవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీకి భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేకమైన రాయితీలు, ఋణ మినహాయింపులు కేటాయింపులు ఏమీ జరగలేదు.

ఫర్టిలైజర్ లు, ఆహారం మరియు పెట్రోలియం సబ్సిడీని బాగా తగ్గించారు.


🔹హోం మంత్రిత్వ శాఖ - ఒక లక్షా అరవై ఆరు వేల ఐదు వందల నలభై ఏడు కోట్లు.

🔹గ్రామీణ అభివృద్ధి శాఖ - 1,33,690 కోట్లు

🔹వ్యవసాయం, రైతుల సంక్షేమం - 1,31,531 కోట్లు.


🔹రోడ్డు రవాణా జాతీయ రహదారులు - 1,18,101కోట్లు

🔹కోవిడ్ వ్యాక్సినేషన్ -  30 వేల కోట్లు.

🔹ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ - 73932 కోట్లు.

🔹విద్యాశాఖ - 93224 కోట్లు.
🔹రైల్వేలు - 1,10,055 కోట్లు
🔹ఆత్మ నిర్భర స్వస్త్య యోజన అనే కొత్త పథకానికి 64,180 కోట్ల తొలి కేటాయింపులు చేయడం జరిగింది.

👉పూర్తిస్థాయి బడ్జెట్ pdf కోసం ఈ క్రింది లింక్  క్లిక్ చేయండి.

👇👇👇