Hot Posts

6/recent/ticker-posts

Telangana Schools Reopen. ఎప్పుడో తెలుసా?

 

💥Telangana Schools Reopen.


 👉అక్టోబర్ 15 నుంచి విద్యా సంస్థలు తెరుచుకోవచ్చని, దానిపై ఫైనల్ నిర్ణయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాల్లో తెలిపింది. 

👉ఆ ప్రకారమే... ఏపీ ప్రభుత్వం నవంబర్ 2 నుంచి స్కూళ్లను తెరవాలని భావిస్తుండగా... తెలంగాణ ప్రభుత్వం కూడా... 


👉నవంబర్ 2 నుంచే స్కూళ్లను తెరవాలనుకుంటున్నట్లు తెలిసింది. స్కూళ్లు తెరవాలంటే... ముందు విద్యార్థులు స్కూళ్లకు వచ్చేందుకు సిద్ధపడాలి... 

👉విద్యార్థుల ఇష్ట ప్రకారమే... ఇది జరుగుతుందని కేంద్రం తెలిపింది. 

👉పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల్ని స్కూళ్లకు పంపేందుకు ముందుకు రావాలి. 

👉ఆంధ్రప్రదేశ్‌లో 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు స్కూళ్లను అక్టోబర్ 5 నుంచి తెరవాలనుకున్నారు.

చివరి నిమిషంలో అది వాయిదా పడింది.


👉ఏపీలో కంటే తక్కువ కరోనా కేసులు నమోదవుతున్న తెలంగాణలో నవంబర్ 2 నుంచి స్కూళ్లను తెరవాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలిసింది. అంటే... దాదాపు నెల సమయం ఉంది. 

👉ఈ నెల రోజుల్లో కరోనా మరింత కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తద్వారా... విద్యార్థులు, తల్లిదండ్రులు... పిల్లల్ని స్కూళ్లకు పంపేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.

👉స్కూళ్లు, హాస్టళ్లను తెరవడంపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,... బీసీ, ఎస్సీ- మైనార్టీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాథోడ్‌లు ఈ నెల 7న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సమావేశమై చర్చిస్తారు. ఓ నివేదిక తయారుచేస్తారు.

👉 దాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇస్తారు. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే... నవంబరు 2 నుంచి 9, 10 తరగతులతో పాటు జూనియర్‌ కాలేజీలు, ఇతర కాలేజీలూ తెరవాలని విద్యాశాఖ అనుకుంటున్నట్లు తెలిసింది. ఏపీ ప్రభుత్వం కూడా... ఇదే ఆలోచనతో ఉంది.


👉తెలంగాణలో కొత్తగా 1718 కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,97,327కి చేరింది. కొత్తగా 8 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య సంఖ్య 1153కి చేరింది. 

👉తాజాగా 2,002 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 28,328గా ఉన్నాయి. 

👉వీటిలో 23,224 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో రికవరీలు పెరుగుతుంటే, మరణాల రేటు బాగా తగ్గుతోంది. 

👉అందువల్ల కరోనా ఉన్నా... ఎవరూ భయపడే పరిస్థితి కనిపించట్లేదు. ప్రజలు కూడా ఇదివరకట్లా... అందరూ మాస్కులు ధరించట్లేదు. 

👉అంతలా కాన్ఫిడెన్స్ పెరిగింది. అందువల్ల స్కూళ్లను తెరవడమే సరైన నిర్ణయంగా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.