DRDO RECRUITMENT 2020:-
DRDO హైదరాబాద్ లో ఉద్యోగాలు.. 54వేల జీతం..
👉నిరుద్యోగులుకు డీఆర్డీఓ శుభవార్త చెప్పింది. ఇప్పటికే అనేక నియామకాలు చేపడుతున్న ఈ సంస్థ తాజాగా హైదరాబాద్ లోని డిఫెన్స్ మెటలర్జికల్ లాబరేటరీ(DMRL)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉మొత్తం 21 నూతన నియామకాలను చేపట్టారు. వీరిని తాత్కాలిక పద్ధతిలో నియమించనున్నారు.
👉ఎంపికైన అభ్యర్థులకు రూ. 54 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. మొత్తం 21 పోస్టులలో 18 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు కాగా.. మరో మూడు రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు.
-👉JRF in metallurgy or material science- ఈ విభాగంలో మొత్తం 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. BE/BTech మెటలర్జికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్, సంబంధిత సబ్జెక్టుల్లో ఫస్ట్ డివిజన్ లో పాస్ అయిన వారు అర్హులు.
👉JRF in physics, JRF in chemistry విభాగాల్లో ఒక్కో పోస్టును భర్తీ చేయనున్నారు. ఆయా కోర్సుల్లో ఫస్ట్ డివిజన్ లో ఎమ్మెస్సీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
-👉JRF in mechanical ఈ విభాగంలో మొత్తం మూడు పోస్టులను భర్తీ చేయనున్నారు. మెకానికల్ ఇంజినీరింగ్ లో బీ.టెక్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
-👉RA in metallurgy or material science ఈ విభాగంలో ఒక పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంటెక్ పూర్తి చేసిన వారు ఇందుకు అర్హులు.
-👉RA in physics, RA in chemistry విభాగాల్లో ఒక్కో పోస్టును భర్తీ చేస్తున్నారు.
👉ఎమ్మెస్సీ ఫస్ట్ డివిజన్ లో పాసై మూడేళ్ల అనుభవం ఉన్న వారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇతర వివరాలను అధికారిక నోటిఫికేషన్ లో చూడవచ్చు.
👉గేట్, యూజీసీ, సీఎస్ఐఆర్-నెట్ లలో మంచి స్కోర్ సాధించిన వారికి ప్రాధాన్యత ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
👉28 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ వారికి మూడేళ్లు వమోపరిమితిని సడలించారు.
💥Official Notification-Direct Link
👉ఆసక్తి, అనుభవం ఉన్న అభ్యర్థులు డీఆర్డీఓ వెబ్ సైట్లో ఉన్న ఫార్మాట్ ఆధారంగా ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది.
💥Official Notification-Direct Link
👉ఆసక్తి, అనుభవం ఉన్న అభ్యర్థులు డీఆర్డీఓ వెబ్ సైట్లో ఉన్న ఫార్మాట్ ఆధారంగా ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది.
👉ఇతర సూచించిన సర్టిఫికేట్ల స్కానింగ్ కాపీలను సైతం admin@dmrl.drdo.in మెయిల్ అడ్రస్ కు జనవరి 2, 2021 లోగా పంపించాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
Social Plugin