Hot Posts

6/recent/ticker-posts

LRS (Layouts Regulation Scheme ) దరఖాస్తుదారులకు Good News.


💥ఎల్ఆర్ఎస్(LRS) దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవో కాస్త ఊరటను ఇచ్చింది. 

👉రిజిస్ట్రేషన్‌ జరిగిన సమయం నాటి మార్కెట్‌ విలువపైనే ఫీజును వసూలు చేస్తామని అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ ప్రకటించినా… 

👉జీవోలో మాత్రం ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారమే ఫీజు ఉంటుందని స్పష్టం చేసింది. అయితే బేసిక్‌ ఛార్జీలను మాత్రం తగ్గించింది. (Layouts Regulation Scheme Rates Reduced)

👉జీవో 131ను మార్పు చేస్తూ కొత్తగా జీవో 135ని అమలులోకి తీసుకొచ్చింది. 

👉దీని ప్రకారం గజం 3 వేల వరకు మార్కెట్‌ రేటు ఉంటే… 20 శాతం ఫీజు కట్టాల్సి ఉంటుంది.


 👉గతంలో ఇది 25 శాతం ఉండేది. అలాగే గజం 5 వేల వరకు ఉంటే 30 శాతం(గతంలో 50 శాతం) కట్టాలి.

👉అలాగే గజం 10 వేల వరకు ఉంటే 40 శాతం(గతంలో 75 శాతం) ఫీజు కట్టాల్సి ఉంటుంది.

👉అటు గజం 20 వేల వరకు 50 శాతం,

👉 గజం 30 వేల వరకు ఉంటే 60 శాతం ఫీజును చెల్లించాల్సి ఉండగా… 

👉గజం 50 వేల వరకు ఉంటే 80 శాతం, 

👉ఆపైన ఉంటే 100 శాతం ఫీజును కట్టాలని కొత్త జీవో పేర్కొంటోంది. కాగా, 

👉గతంలో గజం పది వేలు దాటితే… వంద శాతం ఫీజు కట్టాల్సి ఉండేది.

👉 అంతేకాదు గతంలో నాలుగు శ్లాబ్‌లు ఉంటే… ఈసారి వాటిని ఏడుకు పెంచింది ప్రభుత్వం.