Hot Posts

6/recent/ticker-posts

IT Returns ఆలస్యమైతే ఫైన్ తప్పదు. చివరి తేది ఎప్పుడంటే...

IT Returns ఆలస్యమైతే ఫైన్ తప్పదు. చివరి తేది ఎప్పుడంటే....


👉2019-20 అసెస్మెంట్ ఈయర్(ఆర్థిక సంవత్సరం 2018-19)కు సంబంధించి ఆలస్యమైన లేదా సవరించిన ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఆఖరి తేదీ సెప్టెంబర్ 30 ముంచుకొస్తుంది.

👉 కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో 2019-20 సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీని మూడుసార్లు పొడిగించారు. 

👉ముందు జూన్ 30 వరకు, రెండోసారి జూలై 31 వరకు పొడిగించారు. మరోసారి గడువును పొడిగిస్తారని కొందరు భావిస్తున్నారు.

👉 అయితే అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఈ నెల 30 లోపు రిటర్న్స్ దాఖలు చేయడం మంచిదని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.

👉 గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీరు దాఖలు చేసిన రిటర్న్లో మార్పు లేదా దిద్దుబాటు చేయాలనుకుంటే, సవరించిన రిటర్న్ను కూడా దాఖలు చేయవచ్చు.


💥ప్రతీకాత్మక చిత్రం
రిటర్న్స్ దాఖలు చేయడంలో ఆలస్యం జరిగితే జరిమానా లేదా పన్నుపై వడ్డీ విధించే అవకాశం ఉంది. అందుకే వీలైనంత త్వరగా దాన్ని దాఖలు చేయడం మంచిది. ఈ నేపథ్యంలో ఆలస్యమైన రాబడి(బిలేటెడ్ రిటర్న్) అంటే ఏంటి, దానిపై వడ్డీ, జరిమానా ఎలా విధిస్తారో తెలుసుకుందాం.

👉గడువు తేదీ తర్వాత దాఖలు చేసిన రిటర్నును ఆలస్యమైన ఐటీఆర్(బిలేటెడ్ ఐటీఆర్) అంటారు. దీని సాధారణ గడువు అసెస్మెంట్ ఈయర్ జూలై 31. 2019 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేయవలసిన తేదీ ఆగస్టు 31.

👉 అసెస్‌మెంట్ ఈయర్‌లో దీనికి గడువు మార్చి 2020 వరకు ఉంది. ఐటీఆర్ దాఖలు చేసే తేదీ పొడిగించినా, వాటి మీద వసూలుచేసే జరిమానాలు, పన్ను బకాయిలపై వేసే వడ్డీ నుంచి ఉపశమనం లేదు. 

👉ఒకవేళ పన్ను చెల్లింపుదారుడు గడువు తేదీలోపు ఐటీఆర్ దాఖలు చేయకపోతే(ఇది గత ఆర్థిక సంవత్సరానికి ఆగస్టు 31), డిసెంబర్ 31 వరకు ఆలస్యమైన రిటర్న్లను దాఖలు చేయొచ్చు. కానీ దానిపై రూ.5,000 జరిమానా ఉంటుంది.

👉ఒకవేళ ఆ గడువు లోపు రిటర్నులు దాఖలు చేయలేకపోతే, తర్వాత సంవత్సరం మార్చి 31 వరకు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇందుకు రూ.10,000 జరిమానా విధిస్తారు. 

👉రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్న చిన్నపాటి పన్ను చెల్లింపుదారులు మార్చి 31 వరకు ఆలస్యమైన ఐటీఆర్ దాఖలు చేస్తే రూ.1,000 జరిమానా వర్తిస్తుంది. 

👉గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బిలేటెడ్ రిటర్నులను సెప్టెంబరు నాటికి దాఖలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, దానిపై రూ.10,000 జరిమానా చెల్లించాల్సిందే.

👉ఒకవేళ ఆలస్యమైన ఐటీఆర్ దాఖలు చేసేనాటికి మీకు ఏమైనా పన్ను బకాయిలు ఉంటే, గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి ప్రతి నెలా 1% వడ్డీ చొప్పున బకాయి చెల్లించాల్సి ఉంటుంది.

 👉ఒకవేళ మీరు ముందస్తు పన్ను చెల్లించాల్సి ఉంటే, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ముందస్తు పన్ను చెల్లింపుపై వడ్డీ లేదా డిఫాల్ట్పై వడ్డీని చెల్లించాలి.

 👉"పన్ను చెల్లింపుదారుడు 2019 ఆర్థిక సంవత్సరానికి ముందస్తు పన్ను చెల్లించకపోయినా లేదా ముందస్తు పన్ను ద్వారా 90% కంటే తక్కువ మొత్తాన్ని చెల్లించినా, పూర్తిగా పన్ను చెల్లించే వరకు ప్రతినెలకు 1% లేదా నెలలో కొంత చొప్పున అదనపు వడ్డీ విధిస్తారు. 

👉రిటర్న్ దాఖలు చేసే సమయానికి పన్ను చెల్లించాల్సిన మొత్తాన్ని లెక్కిస్తారు" అని హోస్ట్బుక్స్ లిమిటెడ్ అకౌంటెన్సీ సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్ కపిల్ రానా తెలిపారు.

👉మీకు రిఫండ్ రావాల్సి ఉంటే... మీరు చెల్లించాల్సిన పన్నులు పూర్తిగా చెల్లించినప్పుడే రిఫండ్ వస్తుంది. ఒకవేళ మీకు అర్హత ఉండి కూడా రిఫండ్ చెల్లించడంలో ఆలస్యమైతే, రిటర్న్ దాఖలు చేసిన తేదీ నుంచి రిఫండ్ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లిస్తారు.

👉 ఒకవేళ మీరు ఆలస్యంగా రిటర్ను దాఖలు చేస్తే, ఆ మేరకు మీకు రావాల్సిన రిఫండ్ వడ్డీని కోల్పోతారు.

👉ఒకవేళ మీరు ఆలస్యమైన ఐటీఆర్ను నిర్ణీత తేదీలలో దాఖలు చేయకపోతే, ఆదాయ పన్ను శాఖ నోటీసులు పంపవచ్చు. 

'👉మీకు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉండి కూడా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయకపోతే, జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మాత్రం మీకు ప్రాసిక్యూషన్ నోటీసులు పంపే అవకాశం ఉంది" అని టాక్స్ కనెక్ట్ అడ్వైజరీ సర్వీసెస్ సంస్థకు చెందిన వివేక్ జలన్ వివరించారు.

👉ప్రస్తుత గడువును ప్రభుత్వం మళ్లీ పొడిగించకపోతే, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను రిటర్న్ను దాఖలు చేయడానికి మీకు ఇదే చివరి అవకాశం కావచ్చు. గడువు తేదీ తర్వాత రిటర్న్ దాఖలు చేయడానికి సుదీర్ఘమైన ప్రక్రియ ఉంది. అందుకు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే అనుమతిస్తారు.