Hot Posts

6/recent/ticker-posts

ఆస్తి లో కూతుర్లకు సమాన వాటా :సుప్రీం కోర్ట్

💥ఆస్తి లో కూతుర్లకు సమాన వాటా :సుప్రీంకోర్ట్ 



👉సవరించిన హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆడపిల్లలకు కొడుకులతో పాటు సమాన ఆస్తి హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

👉ఈ మేరకు ఓ కేసులో కీలక తీర్పు ఇచ్చింది. హిందూ వారసత్వ సవరణ చట్టం-2005 అమలుకు ముందే తండ్రి మరణించినప్పటికీ ఆడపిల్లలకు తల్లిదండ్రుల ఆస్తిపై హక్కు ఉంటుందని తెలిపింది.

👉ఓ కేసులో బాధితురాలి తండ్రి 1999, డిసెంబర్ 11న మరణించారు.

👉అయితే, ఆస్తిలో ఆడపిల్లకు సమానహక్కు క‌ల్పించే హిందూ వార‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం 2005లో అమ‌ల్లోకి వ‌చ్చింది కాబట్టి, ఈ కేసులోని బాధితురాలికి ఆస్తిలో సమానహక్కు దక్కదని ప్ర‌తివాదులు వాదించారు.

👉అయితే, తండ్రికి ఆడపిల్ల ఉంటే చాలని, ఆస్తిలో వారికి సమానహక్కు ఉంటుందని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కీలక తీర్పునిచ్చింది.

👉 సవరణ చట్టం అమల్లోకి వచ్చిన 2005, సెప్టెంబర్ 9 నాటికి తండ్రి జీవించి ఉన్నారా? లేదా? అనే దానితో సంబంధం లేకుండా ఆడపిల్లకు వారసత్వ హక్కు ఉంటుందని కోర్టు చెప్పింది.

👉ఆడపిల్లలకు ఆస్తి హక్కుపై సుప్రీం కోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది. ఆడపిల్లలకు ఆస్తిలో సమాన వాటా పంచాల్సిందే అని స్పష్టం చేసింది.

👉చట్టం అమల్లోకి వచ్చే నాటికి తండ్రి బ్రతికి ఉన్నా లేకపోయినా సరే ఆస్తిలో సమాన వాటా ఉండాలి అని స్పష్టం చేసింది.

👉2005 సెప్టెంబర్ 9 నాటికి తండ్రి బ్రతికి ఉన్నా లేకపోయినా సరే సమాన హక్కు అనేది అడపిల్లలకు ఆస్తిలో ఉండాలి అని తీర్పు ఇచ్చింది

👉సవరణ ప్రకారం ఆస్తిలో సమాన హక్కు ఆడ పిల్లలకు ఉంటుంది అని పేర్కొంది.

👉హిందుత్వ వారసత్వ సవరణ చట్టం పై సుప్రీం కోర్ట్ ఈ తీర్పు ఇచ్చింది.

👉ఆడ పిల్లలకు ఆస్తి ఇచ్చే విషయంలో కొందరు తల్లి తండ్రులు పక్ష పాతం చూపిస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి.

👉ఒక్కడే కొడుకు ఉంటే కొడుకుకి ఎక్కువ ఆస్తి ఉంచి ఆడపిల్లలకు 10 శాతం నుంచి 30 శాతం వరకే ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.