Hot Posts

6/recent/ticker-posts

ప్లాస్మా థెరపీ అంటే ఏంటి?


💥ప్లాస్మా థెరపీ అంటే ఏంటి?💥


రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉన్నవారిపై కోవిడ్-19 వైరస్

 ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే, వారి

శరీరంలోకి వైరస్ ప్రవేశించగానే, వారిలోని రోగనిరోధక

కణాలు (తెల్ల రక్త కణాలు) దాడి చేసి ఆ వైరస్‌ను నాశనం

చేస్తాయి. అందుకే, కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న

వారి రక్తంలో రోగనిరోధక కణాల సంఖ్య బాగా వృద్ధి చెంది

ఉంటుంది.


అయితే, కొందరిలో రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా

ఉంటుంది. అలాంటి వారిపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం

చూపుతుంది. వారియొక్క శరీరంలో రోగనిరోధక

కణాలను పెంచగలిగితే వ్యాధిని ఎదుర్కొనే వీలుంటుంది.

అందుకు పరిష్కారంగా, కోవిడ్-19 నుంచి పూర్తిగా

కోలుకున్న వ్యక్తుల నుంచి ప్లాస్మాను సేకరించి, అదే

వైరస్‌తో బాధపడుతున్న మిగతా రోగుల శరీరంలోకి

ఎక్కిస్తారు. ఈ వైద్య విధానాన్నే ప్లాస్మా థెరపీ అంటారు.

💥ప్లాస్మాను ఎలా తీస్తారు?💥


ఎలాంటి సమస్య లేదని నిర్ధరించుకున్న తర్వాత, దాత

నుంచి ఆస్పెరిసిస్ అనే విధానం ద్వారా రక్తాన్ని

సేకరిస్తారు. ఈ సాంకేతిక విధానంలో రక్తం నుంచి ప్లాస్మా

లేదా ప్లేట్‌లెట్లను వేరు చేస్తారు. మిగతా రక్తం మళ్లీ దాత

శరీరంలోకి వెళ్లిపోతుంది.