Hot Posts

6/recent/ticker-posts

TS DEPARTMENTAL TEST -May 2020.

TS DEPARTMENTAL TEST - May 2020.


*🌳నేటి నుంచి డిపార్టమెంటల్‌ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం*
👉ఆగస్టు 16న జీవోటీ,17న ఈవోటీ పరీక్షలు

 👉ప్రభుత్వోద్యోగులు తమ పదవీ కాలంలో పదోన్నతికి అర్హత సాధించేందుకు డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు రాసేందుకు సదవకాశం లభించింది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ 04/2020 తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసింది. ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులకు కలిపి 155 రకాల పేపర్‌ కోడ్‌లతో పరీక్షలు నిర్వహిస్తారు. *రేపటి నుంచి జులై 13వ తేదీలోపు ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్‌* చేసుకోవడానికి అవకాశం ఉంది.

*👉ఎవరు రాయాలి*

 అప్రయత్న పదోన్నతి పథకం (ఏఏఎస్‌)లో భాగంగా ఎస్‌జీటీ లేదా ఎస్‌జీటీ సమాన క్యాడర్‌లో ఉన్న వారు, 12 ఏళ్ల స్కేలు పొందేందుకు ఎలాంటి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు."24 ఏళ్ల స్కేల్‌" పొందడానికి GOT, EOT పరీక్షలు తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలి. "స్కూల్‌ అసిస్టెంట్‌" తత్సమాన క్యాటగిరీ ఉపాధ్యాయులు "12 ఏళ్ల" స్కేల్‌ పొందేందుకు డిగ్రీ, బీఈడీ విద్యార్హతలతో పాటు జీవో (గెజిటెడ్‌ ఆఫీసర్‌), ఈవో (కార్యనిర్వహణాధికారి) టెస్ట్‌ రెండింటిలోనూ తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. ‘స్కూల్‌ అసిస్టెంట్లు "గెజిటెడ్‌ హెచ్‌ఎంలుగా" పదోన్నతి పొందేందుకు జీఓ, ఈఓ పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి.
ఉత్తీర్ణత మార్కులు ఇలా
 డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి పరీక్షలోనూ 40 శాతం మార్కులు సాధించాలి. అయితే జీవో టెస్ట్‌లో రెండు పేపర్లు ఉన్నాయి. కాబట్టి ప్రతి పరీక్షలోనూ 40 శాతం మార్కులు సాధించాలి.

*👉సిలబస్‌*

 GOT(కోడ్ 88) పేపర్ l:

 ఇన్‌స్పెక‌్షన్స్‌ కోడ్స్‌ ది గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కోడ్స్, ఎలిమెంటరీ స్కూల్‌ రూల్స్, పీఎఫ్‌ రూల్స్‌ ఫర్‌ నాన్‌ పెన్షనబుల్‌ సర్వీసులతో పాటు వర్తమాన అంశాలు ప్రిపేర్‌ అవ్వాలి.

 *GOT(కోడ్ 97) పేపర్ ll*

 టియస్ పాఠశాల విద్య, సర్వీస్‌ నిబంధనలు, టియస్ సీసీఏ రూల్స్,
 టియస్ మండల ప్రజా పరిషత్‌ చట్టం, టియస్ ఓఎస్‌ఎస్‌తో పాట వర్తమాన అంశాలు ఉంటాయి.

*👉EOT పరీక్ష (కోడ్‌141) సిలబస్‌:*

 టియస్ బడ్జెట్‌ మాన్యువల్, టియస్ ఖజానా శాఖ కోడ్, టియస్ పింఛన్‌ కోడ్, భారత రాజ్యాంగ నిర్మాణం, కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌), పీఆర్‌సీకి సంబంధించిన అంశాలను ప్రిపేర్‌ అవ్వాలి.

*👉ఫీజు వివరాలు*

 ప్రతి పేపర్‌కు రూ.200 వంతున ఫీజు చెల్లించాలి. జీవోటెస్ట్‌(GOT)కు రెండు పేపర్లకు రూ 400,ఈవోటెస్ట్‌(EOT)కు రూ.200 చొప్పున మొత్తం రూ.600 చెల్లించాలి. అలాగే ప్రతి పరీక్షకూ రూ.50 ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలి.

*👉పరీక్ష తేదీలు:*

 GOT (కోడ్‌ 88,) పేపర్‌–1 

 *ఆగస్టు 16 ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు,* జీవోటి(కోడ్ 97)పేపర్‌–2 *అదే రోజు మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల* వరకూ ఉంటుంది.

*EOT (కోడ్‌141)*

 ఆగస్టు 17 ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది.

 *స్పెషల్ లాంగ్వేజ్ టెస్టు(పేపర్ కోడ్ 37)* తేది
 ఆగస్టు23, 2020.ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.00 గం. వరకు ఉంటుంది👇

Webnote:- Click here


         Online Apply Here


            💥ALL THE BEST💥