ఒక రోజు శాస్త్రవేత్త అవుతారా?
విద్యార్థులూ.. మీకు శాస్త్ర పరిశోధనలపై ఆసక్తి ఉందా? ఒక రోజు శాస్త్రవేత్త అవుతారా? అందుకు హైదరాబాద్‌లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్)కు చెందిన పరిశోధన సంస్థలు సీసీఎంబీ, ఐఐసీటీ, ఎన్‌జీఆర్‌ఐ మరోసారి అవకాశం కల్పిస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ... ‘మన్ కీ బాత్’లో ప్రసంగిస్తూ.. ప్రయోగశాలల్లో ‘ఒక రోజు శాస్త్రవేత్త’గా గడపాలని విద్యార్థులకు సూచించారు.
ఈక్రమంలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు దేశంలో సీఎస్‌ఐఆర్‌కు చెందిన 37 ప్రయోగశాలల్లో జులై 21 నుంచి 25 వరకు ఈ అవకాశం కల్పించారు.
పాఠశాల విద్యార్థులకు పరిశోధన వాతావరణాన్ని పరిచయం చేయడం, శాస్త్రవేత్తలతో చర్చించే అవకాశం కల్పించడం ఈ కార్యక్రమ లక్ష్యం.
ప్రతిరోజూ 75 నుంచి 100 మంది విద్యార్థులకు ఈ అవకాశం కల్పిస్తారు.
ఆన్‌లైన్ ద్వారా https://jigyasa-csir.in/v2/auth/index.html ఈ అడ్రస్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Social Plugin