మదర్స్ డే శుభాకాంక్షలు.
భూ ప్రపంచంలో సాటిలేని, సాటిరాని మనిషి-అమ్మ
భూదేవికి ఉన్నంత ఓర్పు గల మనిషి - అమ్మ
భూమాతకు ఉన్నంత సహనం ఉన్న మనిషి- అమ్మ
భూతల స్వర్గాన్ని భువిపై చూపే మనిషి - అమ్మ
భూమిపై కుటుంబ వ్యవస్థకు మూలాధారం - అమ్మ
భువిలో తియ్యనైన, మధురమైన పదమే - అమ్మ
భూమయీలందరిలో ప్రేమను పంచేది - అమ్మ
భూరికన్నా విలువైనది జగతిన - అమ్మ
అమ్మ పదంలోని "అ" లోనే దాగి ఉన్నది అభిమానం, అనురాగం, అనునయం, అభయహస్తం, ఆప్యాయత, ఆదరణ, ఆరాటం, ఆశయం, ఆవేశం, ఆవేదన, ఆత్రం, ఆలోచన, అమృతం కదా!
అమ్మ పదంలోని "మ్మ" లోనే మనసు మమత, మమకారం, మంచితనం, మాధుర్యం, మానవత్వం, మమేకం, మహర్షి, మూర్తీభవం దాగి ఉన్న గుణాలు కదా!!
ఇన్ని గుణాలను పంచగల, అందించగల, నేర్పించగల మాతృమూర్తులందరికీ హృదయపూర్వక "మదర్స్ డే" శుభాకాంక్షలు......
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌎🌎🌎🙏🙏🙏🙏🙏🙏
Social Plugin