World sparrows day.. 20/03/2021.
👉పిచ్చుకలు పంట చెన్లలో, పల్లె ముంగిళ్లలో, ధాన్యపు రాశులలో కిలకిలమంటూ సందడి చేస్తూ ఉండేవి. నాడు గ్రామాల లోని ఇండ్ల ముంగిట ఇవి గుంపులుగా వాలడం ఏదో శబ్దం అవగానే తుర్రుమని ఎగరడం వంటి దృశ్యాలు సందడిగా చూడముచ్చటగా ఉండేవి.
👉 ఈ పక్షులు దిగుడు బావులలో వేలాడుతూ ఉండే చెట్లపై కట్టుకున్న గూళ్లు చాలా అద్భుతంగా ఉండేవి. ఇవి పూరిళ్ల చూరులలో గూళ్లు కట్టుకొని జన ఆవాసాలతో మమేకమై ఉండేవి.
👉మనిషి అభివృద్ధి పరుస్తున్న సాంకేతిక పరిజ్ఞానం వీటి మనుగడకు శాపంగా మారింది. రేడియేషన్, కాలుష్యం కారణంగా ఇవి ప్రకృతి నుంచి కనుమరుగవుతున్నాయి.
👉జన ఆవాసాలతో మమేకమై జీవిస్తున్న ఇవి మెత్తని పీచు వట్టి వాటితో గూడు కట్టడం, గుడ్లను పొదగడం, నోటితో ఆహారాన్ని తెచ్చి పిల్లలకు అందించటం, ఆ పిల్లలకు రెక్కలొచ్చి ఎగిరెంత వరకు జాగ్రతగా కాపాడటం మనకు తరచూ కనిపించే దృశ్యాలు, ఈ దృశ్యాలు తల్లి ప్రేమకు నిదర్శనంగా నిలుస్తాయి.
👉ఈ పిచ్చుకల అన్యోన్యతను ఆదర్శవంతంగా గుర్తించిన ప్రపంచ దేశాలు ప్రతి సంవత్సరం మార్చి 20 న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి.
👉ఈ పిచ్చుకల ప్రాధాన్యతను గుర్తించిన భారతదేశ ప్రభుత్వం తపాలా బిళ్లను కూడా విడుదల చేసింది.
👉జనావాసాల మధ్య నివసిస్తున్న పిచ్చుకల మనుగడకు ప్రమాదం ఏర్పడితే అది మనిషి మనుగడకు ఎందుకు ప్రమాదం కాదు అని గుర్తించిన ప్రపంచ దేశాలు "ప్రపంచ పిచ్చుకల దినోత్సవము" రోజు పిచ్చుకల మనుగడకు అవసరమైనటువంటి ప్రాధాన్యత అంశాలపై చర్చించి అందుకు అనుగుణంగా కార్యక్రమాలను చేపడుతున్నాయి.
Social Plugin