🔥నూతన సంవత్సరం లో ఉద్యోగులకు శుభవార్త చెప్పనున్న కేంద్రం.. 🔥
👉గడిచిన గత ఎనిమిది, తొమ్మిది నెలలుగా మనదేశంలో కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తారాస్థాయిలో ఉంది.
👉ఈ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్ డౌన్ ఆంక్షలు విదించటంతో అన్ని రంగాల పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయి.
👉అలాగే పేద, బడుగు, బలహీన వర్గాలతో పాటుగా మధ్య తరగతి వారు అనేక రకాల ఇబ్బందులకు గురయ్యారు. ఒకరకంగా జన జీవనం స్తంభించిపాయింది.
👉 దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం కూడా పలు కీలక చర్యలు తీసుకుంది.
👉ఇందులో భాగంగా పలు ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించిన సంగతి తెలిసిందే .
👉అయితే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ కొత్త ఏడాదిలో కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్దం అవుతోంది.
👉త్వరలో మోదీ సర్కార్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త అందించే ఛాన్స్ ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
👉ట్యాక్స్ రిబేట్ ప్రకటించొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ రోజున ఈ ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తుంది .
👉ఈ కోవిడ్ 19 ఉద్యోగులపై చాలా ప్రభావం చూపింది. అందువల్ల వీరికి ఊరట కలిగించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది .
👉బడ్జెట్ 2021-22లో పన్ను మినహాయింపు ప్రయోజనాల కల్పించొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచే ఛాన్స్ ఉందని తెలిపాయి.
👉WHAT’S UP GROUP:-https://chat.whatsapp.com/F5U3vVJuCemED3Xzfruk2K
👉TO JOIN OUR TELEGRAM GROUP:-https://t.me/joinchat/KR0qYxsa_btff4eKufSpOQ
👉To subscribe our youtube channel:-http://www.youtube.com/c/JBkrishna
👉ప్రస్తుతం రూ.50 వేల వరకు తగ్గింపునకు అవకాశం ఉంది. దీన్ని రూ.లక్షకు పెంచే అవకాశముంది.
👉కేవలం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపుతోపాటు మరో బెనిఫిట్ కూడా కల్పించొచ్చని తెలుస్తోంది.
👉మెడికల్ ఇన్సూరెన్స్‌కు చెల్లించే ప్రీమియం చెల్లింపులపై కూడా పన్ను ఉపశమనం లభించొచ్చు.
👉ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలోకి సెక్షన్ 80డీ కింద ప్రస్తుతం రూ.25 వేల వరకు ప్రీమియంపై పన్ను ప్రయోజనం పొందొచ్చు.
Social Plugin