Hot Posts

6/recent/ticker-posts

హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.

హైదరాబాద్ ప్రజలకు శుభవార్త. 



👉 నూతన సంవత్సర తొలి వారంలో హైదరాబాద్ లో ఉచిత తాగునీటి కార్యక్రమ ప్రారంభం అవుతుందని మంత్రి కేటిఆర్ అన్నారు. 

👉ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు Hyd జలమండలి ద్వారా 20,000 లీటర్ల వరకు తాగు నీటి వినియోగం ఉచితం అని ఆయన పేర్కొన్నారు.

 👉ఇందుకు కావలసిన కార్యాచరణ పైన మంత్రి కేటీఆర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

 👉ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు జలమండలి ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

👉ముఖ్యమంత్రి నగర ప్రజలకు ఇచ్చిన మాట మేరకు డిసెంబర్ నెల తాగు నీటి వినియోగం 20 వేల లీటర్ల వరకు ఉచితం అని మంత్రి పేర్కొన్నారు.


👉ఈ మేరకు జనవరిలో వినియోగదారులకు వచ్చే డిసెంబర్ నెల బిల్లులో 20,000 లీటర్ల వరకు బిల్లు వేయొద్దని  ఆదేశాలు ఇచ్చారు.

👉ఒకటి రెండు రోజుల్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలను సిద్ధం చేయాలని జలమండలికి ఆదేశాలు ఇచ్చారు. 

👉సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు త్వరలోనే హైదరాబాద్ నగర ప్రజలకు ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. 

ప్రగతి భవన్లో.. ఈ సమీక్షా సమావేశం జరిగింది. 

👉హైదరాబాద్ నగర ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రయోజనం కలిగేలా త్వరలోనే ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు మంత్రి చెప్పారు.


👉రానున్న రెండు వారాల పాటు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించుకోవాలని ఈరోజు జరిగిన సమావేశంలో జలమండలి అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. 

👉ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నగర ప్రజలకు ఇచ్చిన మాట మేరకు డిసెంబర్ నెల నుంచి 20,000 లీటర్ల వరకు తాగు నీటి వినియోగానికి ఎలాంటి రుసుము తీసుకోమని, ఈ మేరకు జనవరిలో వినియోగదారులకు వచ్చే డిసెంబర్ బిల్లులో 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 

👉ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఉన్న మొత్తం కనెక్షన్లు మరియు నీటి సరఫరాకి అవసరమైన ఏర్పాట్లు, ఈ కార్యక్రమానికి సంబంధించి అవసరమైన విధి విధాన రూపకల్పన పైన ఈ సమావేశంలో మంత్రి సమీక్ష జరిపారు.