అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10:-
👉ఐక్యరాజ్య సమితి 1948, డిసెంబరు 10న విశ్వమానవ హక్కుల ప్రకటన చేసింది.
👉కనుక డిసెంబర్ 10వ తేదీని అంతర్జాతీయ మానవహక్కుల దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపు కొంటారు.
👉మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడం కోసం కోర్టులతో పాటు మానవ హక్కుల కమిషన్లు ఏర్పాటుచేయబడ్డాయి.
👉1948 డిసెంబరు 10న ఐక్యరాజ్య సమితి ఆమోదించిన 'విశ్వ మానవ హక్కుల తీర్మానం' భారత రాజ్యాంగ రచయితల్లో స్ఫూర్తిని నింపింది.
👉వివక్షత లేనటువంటి మానవ సమాజ నిర్మాణమే అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవ లక్ష్యం. మానవ హక్కులు అంటే... ఎలాంటి వివక్ష, అసమానత, వ్యత్యాసం లేకుండా, సమానత్వంతో ఉన్నతమైన గౌరవాన్ని ప్రతి వ్యక్తికీ శాశ్వతంగా కల్పించాలి.
👉1789లో రుపొందించిన ''ద డిక్లరేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ద సిటిజన్'' ప్రేరణతో మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన వచనాన్ని 1948లో పునః రూపొందించారు.
👉 ఎలినార్ రూజ్వెల్డ్ అధ్యక్షత వహించిన 18మంది సభ్యులతో కూడిన కమిటీ ముసాయిదా బిల్లు రూపొందించింది. కెనడాకి చెందిన జాన్ పీటర్స్ హంఫ్రీ ఈ బిల్లును స్వదస్తూరితో రాశారు.
👉ఫ్రాన్స్‌కి చెందిన రెనే క్యాస్సినే తుది మెరుగులు దిద్దారు. పారిస్‌లో 1948 డిసెంబర్ 10న జరిగిన ఐక్యరాజ్య సమితి మూడో జనరల్ అసెంబ్లీ సమావేశంలో మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన ఆమోదం పొందింది.
👉1947-48లో మానవ హక్కులపై ఐక్యరాజ్యసమితి కమిషన్‌లో జరిగిన సమావేశానికి భారతదేశం తరపున హాజరైన మహిళా ప్రతినిధి హంస మెహతా.
👉ఆమె భారత్‌లోనూ, విదేశాల్లోనూ మహిళల హక్కుల కోసం పోరాడారు.
👉మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన రూపకల్పనలోనూ హంస మెహతా పాలుపంచుకున్నారు.
👉రెండు ప్రపంచయుద్ధాలతో అపారమైన ప్రాణనష్టం జరిగింది. అంతేకాకుండా యూదు జాతిపై ఊచకోత, అణుబాంబు దాడి, యుద్ధ ఖైదీలను క్రూరంగా హింసించడం, ఆఫ్రికా దేశాల నుంచి ప్రజలను బానిసలుగా ఎగుమతి చేయడం, మహిళలపై అరాచకాలు, పిల్లలను బానిసలుగా, బాల కార్మికులుగా ఉపయోగించడం, ఒక నిర్దిష్ట జాతి లేదా మతానికి చెందిన వారిని చిన్నచూపు చూడటం, వర్ణ వివక్ష వంటి విషయాలు ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేశాయి.
👉రెండో ప్రపంచయుద్ధం ముగుస్తున్న తరుణంలో ప్రపంచ అగ్రదేశాల ప్రతినిధులు 1944లో వాషింగ్టన్‌లోని జార్జిటౌన్లో సమావేశమయ్యారు.
👉ఇలాంటి చర్యలను అరికట్టకపోతే ప్రపంచ వినాశనం తప్పదని తీర్మానించారు.
👉తత్ఫలితంగా ఐక్యరాజ్య సమితి ఉద్భవించింది. అన్ని దేశాలు కలిసి హక్కుల ప్రాముఖ్యంపై చర్చించడానికి మార్గం సుగమమైంది.
👉పురుషులు, స్త్రీలు, పెద్ద, చిన్న దేశాలన్న తారతమ్యం లేకుండా అందరు సమాన హక్కులు కలిగి ఉండాలని పునరుద్ఘాటించడానికి ఒక వేదిక అవసరమైంది.
👉పౌర సంఘాలు, వివిధ దేశాలు ఐక్యరాజ్యసమితికి పలు విన్నపాలు చేసి మానవ హక్కుల కమిషన్ ఏర్పాటులో అవి సఫలీకతమయ్యాయి.
👉1946 ఏప్రిల్‌లో ఎలోనార్ రూజ్వెల్డ్ అధ్యక్షతన తొమ్మిది మంది సభ్యులతో తాత్కాలిక బందాన్ని ఏర్పాటు చేశారు.
👉 మానవ హక్కుల అంతర్జాతీయ బిల్లును సాధ్యమైనంత త్వరగా రూపొందించాలని ఆ బందం సూచించింది.
👉ఎలినార్ రూజ్వెల్డ్ అధ్యక్షతన 1947 జనవరిలో 18మంది సభ్యులు గల నూతన మానవ హక్కుల కమిషన్ మొదటిసారిగా సమావేశమైంది.
👉ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక క్లిష్టమైన సమస్యలను పరిశీలించింది.
👉మానవ హక్కుల అభివృద్ధికి తోడ్పడే అంతర్జాతీయ బిల్లు కోసం ముసాయిదా రూపకల్పనను ప్రారంభించింది.
👉మన రాజ్యాంగంలోనూ మానవహక్కుల ప్రస్తావన చేయబడింది.
👉సమసమాజ స్థాపన లక్ష్యంగా ప్రకటించబడింది. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన (1948) మానవ హక్కుల ప్రకటనను యధాతథంగా అంగీకరిస్తూ భారత ప్రభుత్వం వాటి పరిరక్షణకు హామీ ఇచ్చింది.
👉అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఎన్నో మానవ హక్కుల ఒప్పందాలపై సంతకం చేసింది.
👉 భారతదేశంలో సామాజిక నాగరికతకు ప్రజాస్వామిక పునాదులు ఉన్నాయి. కానీ చరిత్రను పరిశీలించినపుడు సామాన్య జనుల ప్రాథమిక హక్కులు నిరంతరం అణచివేతకు గురవ్వడం గమనిస్తాం..
వ్యవస్థీకతమైన ఆధిపత్యం నుంచి సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో హక్కుల అతిక్రమణ పుడుతుంటుంది.
Social Plugin