జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగింది. డిసెంబరు 1న పోలింగ్ నిర్వహించనున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి ప్రకటించారు. ఈ రోజు ఆయన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సారి మేయర్ పీఠం జనరల్ మహిళకు కేటాయించిన్నట్లు తెలిపారు. రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని వివరించారు. 18, 19, 20 తేదీల్లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. 21న వాటిని పరిశీలిస్తామన్నారు. 22న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అదే రోజు తుది అభ్యర్థుల జాబితాను, కేటాయించిన గుర్తులను ప్రకటిస్తామన్నారు. డిసెంబర్ 1 ఎన్నికలను నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని ప్రకటించారు.
4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది.
ఎన్నికల కమిషనర్ విడుదల చేసిన నోటిఫికేషన్ కాపీ
గత ఎన్నికల్లో కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారమే ఈ సారి ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సారి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎస్ఈసీ ప్రకటనతో జీహెచ్ఎంసి పరిధిలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషనర్ హెచ్చరించారు.
Social Plugin