Hot Posts

6/recent/ticker-posts

GHMC 2020 ఎన్నికల వార్డులు, అభ్యర్థులు, తేదీలు, కౌంటింగ్ పూర్తి వివరాలు

 GHMC Elections 2020: 




👉నవంబర్ 17న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. డిసెంబరు 1న పోలింగ్ జరపనున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి.. ప్రకటించారు.

 👉ఈసారి మేయర్ పీఠం జనరల్ మహిళకు కేటాయించిన్నట్లు తెలిపారు. 

👉మర్నాడే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 18, 19, 20 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ జరిగింది. 

👉21న వాటిని పరిశీలించారు. 22న మధ్యాహ్నం 3 గం,, ల వరకు నామినేషన్లను విత్ డ్రా చేశారు..

👉 అదే రోజు తుది అభ్యర్థుల జాబితాను, కేటాయించిన గుర్తులను ప్రకటించారు. 


👉డిసెంబర్ 1 ఎన్నికలు జరగనున్నాయి. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది.


1.ఎన్నికలు జరిగే తేదీ?


💥డిసెంబర్ 1


2.పోలింగ్ టైమ్:-

💥ఉదయం 7 గంటల నుంచి మొదలు. సాయంత్రం 6 గంటలకు ముగింపు.


3.ఓట్ల లెక్కింపు ఎప్పుడు?

💥డిసెంబర్ 4న. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.


4.ఎన్నికలు ఎలా జరుగుతాయి?

💥బ్యాలెట్ పద్ధతి.


5.హైదరాబాద్ లిమిట్స్‌లో పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి?

💥మొత్తం పోలింగ్ కేంద్రాలు 4936. వాటిలో 62 సైబరాబాద్ పరిధిలో ఉండగా... 105 సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఉన్నాయి. అవి కాకుండా 4979, Hyd  లిమిట్స్‌లో ఉన్నట్లు లెక్క.


6.గ్రేటర్ పరిధిలో పోలింగ్ కేంద్రాలు ఎన్ని?

💥9,248 పోలింగ్ కేంద్రాలు

 (1,439 సున్నితమైన, 1,004 సమస్యాత్మక, 257 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు.)


6.మొత్తం వార్డులు ఎన్ని?

💥150 వార్డులు


7.ఎంత మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు?

💥వివిధ పార్టీలకు చెందిన మొత్తం 1,893 మంది అభ్యర్థులు,  నామినేషన్లు దాఖలు చేయగా వీటిలో.. 68 నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. 

దీంతో BJP  539,, TRS 527,, కాంగ్రెస్‌ 348,,  టీడీపీ 202, ఎంఐఎం 72, సీపీఐ 22, సీపీఎం 19, గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుంచి 143, 

స్వతంత్ర అభ్యర్థులు 613 నామినేషన్లు సవ్యంగా ఉన్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి..


8.మొత్తం పోలింగ్ లొకేషన్లు ఎన్ని?

💥1632


9.సున్నితమైన (సెన్సిటివ్) ప్రాంతాలెన్ని?

💥601 పోలింగ్ లొకేషన్లు,, 1704 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవి..


10.హైపర్ సెన్సిటివ్ (అతి సున్నిత) ప్రదేశాలెన్ని?

💥307 పోలింగ్ లొకేషన్లు, 1085 పోలింగ్ కేంద్రాలు అతి సున్నితమైనవి.


11.హైదరాబాద్ లిమిట్స్‌లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయి?

💥15 ఉన్నాయి.



12.ఎన్ని షీ టీమ్స్ రంగంలోకి దిగాయి?

💥6 షీ టీమ్స్




13.పోలింగ్ కేంద్రం దగ్గర ఖాళీగా నిల్చోవచ్చా?

💥 100 మీటర్ల అవతల ఉండొచ్చు.