Hot Posts

6/recent/ticker-posts

నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.

 



👉ఓవైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు సవాళ్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళలోనూ సంక్షేమ రథానికి ఎలాంటి ఢోకా లేకుండా చూసుకోవటం..మరోవైపు తాను నమ్మిన సంక్షేమ పథకాల్ని పెద్ద ఎత్తున అమలు చేయటం చాలా తక్కువగా ఉంటుంది. 


👉కానీ.. అందుకు భిన్నంగా తరచూ ఏదో ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకురావటం.. పలు వర్గాలకు లబ్థి చేకూరేలా నిర్ణయం తీసుకోవటంలో జగన్ సర్కారు తర్వాతే ఎవరైనా. 



👉తాజాగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువకులకు అద్భుతమైన అవకాశాన్ని జీవో నెంబరు 69 ద్వారా కల్పించింది ఏపీ సర్కారు.


👉రాష్టంలోని నిరుపేద ఈబీపీ.. బీసీ.. ఎస్సీ వర్గాలకు చెందిన వారు ఈ పథకంలో లబ్థిదారులు. సరకు డెలివరీ వ్యాన్లను రుణాల మీద ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.


👉ఫోర్ వీలర్ మినీ ట్రక్కులను 60 శాతం రాయితీతో ఇవ్వనున్నారు. ఇందుకోసం అర్హుల నుంచి అప్లికేషన్లు కోరుతున్నారు. 


👉దీని కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఉండాల్సిన అర్హతల విషయానికి వస్తే..


👉దరఖాస్తు కుటుంబానికి నెలకు రూ.10వేల లోపు ఆదాయం.. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి.. పెన్షన్ సౌకర్యం పొందే వారికి అవకాశం ఉండదు. 


👉సదరు కుటుంబంలో నాలుగు చక్రాల బండి ఏదీ ఉండకూడదు. 

👉అంతేకాదు 21-45 ఏళ్ల లోపు వారై ఉండాలి. ఎల్ఎంవీ డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలి.


 👉గతంలో బ్యాంకులో అప్పు  తీసుకొని తిరిగి చెల్లించకుండా ఉన్న హిస్టరీ ఉండకూడదని పేర్కొనడం జరిగింది. 


👉ఈ పథకంలో భాగంగా ఎంపికైన వారు తొలుత రూ.58119 మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. 

👉దీనికి రూ.174357 మొత్తాన్ని వాహనానికి తీసుకునే లోన్ కింద ఇస్తారు. ఇక ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.348714 మొత్తాన్ని ఇస్తారు. 


👉బ్యాంకు రుణాన్ని ఆరేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్లు పెట్టుకోవటానికి చివరి తేదీ డిసెంబరు 5గా చెబుతున్నారు. మరిన్ని వివరాలు గ్రామ సచివాలయంలో తెలుసుకోవచ్చు. 


👉ఏమైనా.. ఇంత భారీ పథకం ఏ రాష్ట్ర సర్కారు అమలు చేసి ఉండదన్న మాట వినిపిస్తోంది.