తెలంగాణ లో స్కూల్ ల ప్రారంభం పై కీలక ప్రకటన.
👉కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా 8 నెలలుగా స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. పదో తరగతి పరీక్షలను కూడా రద్దు చేసి నేరుగా పాస్ చేశారు.
👉ఐతే లాక్డౌన్లో భాగంగా ప్రస్తుతం అన్‌లాక్-5 నడుస్తోంది. ఇందులో ఎన్నో ఆంక్షలకు కేంద్ర ప్రభుత్వ సడలింపులు ఇచ్చింది.
👉 అక్టోబరు 15 నుంచి స్కూళ్లు, థియేటర్లు తెరవచ్చని మార్గదర్శకాలు విడుదల చేసింది. దాన్ని యథావిధిగా అమలు చేసేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి.
👉స్కూళ్లు, కాలేజీలు తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఐతే తెలంగాణలో మాత్రం ఇప్పట్లో స్కూళ్లు తెరచుకునే అవకాశం కనిపించడం లేదు.
👉దసరా తర్వాతే స్కూళ్ల రీ ఓపెనింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది.
👉కరోనా నేపథ్యంలో విద్యా వ్యవస్థలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పాఠశాలల ప్రారంభం, నిర్వహణ సహా పలు అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం బుధవారం ఉన్నతాధికారులతో సమావేశమైంది.
👉ఈ సమావేశానికి మంత్రులు సబితారెడ్డి, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ హాజరయ్యారు. అక్టోబరు 15 నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థల ప్రారంభం సాధ్యం కాదని సమావేశం అనంతరం మంత్రులు స్పష్టం చేశారు.
👉బతుకమ్మ, దసరా పండుగల తర్వాత దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. కేరళలో ఓనం పండుగ తర్వాత కరోనా వైరస్ మళ్లీ ఉగ్రరూపం దాల్చిందని.. ఈ క్రమంలో తెలంగాణలోనూ అప్రమత్తంగా ఉండడం అవసరమని అభిప్రాయపడ్డారు.
👉పండుగల తర్వాత పరిస్థితిని బట్టి పాఠశాలలు, గురుకులాలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు ఇతర విద్యాసంస్థల ప్రారంభంపై అధికారులు విధివిధానాలను రూపొందించిన తర్వాత..
👉వాటి ఆధారంగా సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఐతే ఉన్నత విద్యాశాఖ పరిధిలోని కాలేజీలు మాత్రం నవంబరు 1 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు.
👉''రాష్ట్రంలో 86 శాతంమందికి ఆన్లైన్ విద్య అందుతుందని ఓ సర్వే ద్వారా తేలింది. రానున్న రోజుల్లో విద్యార్థులకు డిజిటల్ బోధన తప్పనిసరి.
👉పాఠశాలల్లో వసతుల నిర్వహణను స్థానిక సంస్థలకు అప్పగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో దానిపైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.'' అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
👉ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా సమష్టి నిర్ణయం తీసుకుంటామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఇది 👉ప్రైవేటు పాఠశాలలకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కాదు..
👉వారి ఆరోగ్యం కాపాడటం కూడా ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.
👉స్కూళ్ల రీఓపెనింగ్‌కు సంబంధించి తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ అభిప్రాయపడ్డారు.
👉 గిరిజన ప్రాంతాల్లో సిగ్నల్స్ లేని కారణంగా విద్యార్థులు ఆన్ లైన్ విద్యలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
👉విద్యాసంస్థల ప్రారంభంపై అన్ని కోణాల్లో ఆలోచించాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
👉విద్యార్థులు, ఉపాధ్యాయుల విషయంలో ఒకే విధమైన నిబంధనలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
👉అక్టోబరు 15 నుంచి పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు, థియేటర్లు తెరవచ్చని కేంద్రం అన్‌లాక్ 5 మార్గదర్శకాల్లో చెప్పినప్పటికీ..
👉తుది నిర్ణయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పుడే స్కూళ్లను తెరవద్దని మంత్రి వర్గ ఉపసంఘం అభిప్రాయపడింది.
👉దసరా తర్వాతే స్కూళ్ల రీఓపెనింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అప్పటి వరకు ఆన్లైన్లో విద్యార్థులకు పాఠాలను బోధిస్తారు.
Social Plugin