Hot Posts

6/recent/ticker-posts

తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో... పలు నిర్ణయాలకు ఆమోదం.

 

💥తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో... పలు నిర్ణయాలకు ఆమోదం.💥

👉సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. సమావేశం దాదాపు 4 గంటల పాటు కొనసాగింది. 

👉భేటీలో మంత్రిమండలి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. 

👉వ్యవసాయ రంగంపై సమగ్రంగా చర్చించిన క్యాబినెట్ ఈ సారి కూడా గ్రామాల్లోనే ధాన్యం సేకరణ చేసేందుకు నిర్ణయించింది.

- 👉రాబోయే సీజన్ లో రాష్ట్రంలో సాగుచేయబోయే మొక్కజొన్న అంశంపై క్యాబినెట్ చర్చించింది. 

👉వ్యవసాయరంగంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, అదేవిధంగా మొక్కజొన్న దిగుమతులపై సుంకాలు తగ్గించడం వంటి చర్యలతో రాష్ర్టంలో మొక్కజొన్న సాగు చేయకపోవడమే శ్రేయస్కరమని అభిప్రాయపడింది.

-👉నాలా (NALA) చట్టానికి సవరణ. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే క్రమంలో సంబంధిత అధికారి విచక్షణాధికారం దుర్వినియోగానికి గురికాకుండా చూసేందుకు నూతన రెవెన్యూ చట్టంలో సవరణలు సూచించింది. 


👉ధరణి పోర్టల్ ద్వారా సంబంధిత వివరాలను అందచేస్తూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును పౌరులకు కల్పిస్తూ, భూమార్పిడి సులభతరం చేస్తూ చట్ట సవరణకు మంత్రి మండలి నిర్ణయించింది.

-👉 రిజిస్ట్రేషన్ చట్టానికి స్వల్ప సవరణలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

-👉 జీహెచ్ఎంసీ పాలకమండలిలో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యానికి చట్టబద్దత కల్పిస్తూ జీహెచ్ఎంసీ చట్టం - 1955 సవరణ. 

👉వార్డు కమిటీల పనివిధానానికి సంబంధించి, వార్డుల రిజర్వేషన్ కు సంబంధించిన అంశంలో చట్ట సవరణలు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది.

-👉 రాష్ట్రంలో కొనసాగుతున్న ఆన్‌లైన్ ఆస్తుల నమోదుకు గడువును మరో పది రోజుల పాటు అనగా అక్టోబర్ 20వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది.

👉- హెచ్ఎండీఎ పరిధిలో ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ విధానంపై క్యాబినెట్ చర్చించింది.